బిజినెస్

16 టైర్ల వాహనంతో అశోక్ లేలాండ్ ముందంజ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, డిసెంబర్ 16: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలలో వాణిజ్య వాహన విభాగంలో అశోక్ లేలాండ్ ముందంజలో ఉందని ఆటోమోటివ్ మానిఫక్చర్స్ ప్రైవేటు లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజీవ్ సంఘ్వీ అన్నారు. ఆదివారం వరంగల్‌లో అశోక్ లేలాండ్ 16టైర్ల 4123 మోడల్ వాహనాన్ని ప్రదర్శించారు. పరిశ్రమల్లో 47.50 టన్నుల జీవీడబ్ల్యు (గ్రాస్ వెహికిల్ వెయిట్)తో 16టైర్ల మోడల్‌ను అందించడం ఇదే మొదటి సారి. వినియోగ దారులకు పూర్తి ప్రయోజనం అందించడంతో పాటుగా రవాణ తీరును సమూలంగా మార్చే సామర్ధ్యం దీని ప్రత్యేకత. భారీ ఉత్పత్తులైనటువంటి స్టీల్, సిమెంట్, ఇతర బరువైన మెటిరియల్స్‌ను రవాణ చేసేందుకు ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. వీటిలో మద్యంతర వాణిజ్య వాహనాలు( ఐసీవీలు) టిప్పర్లు, హౌలేజ్ ఉన్నాయి. ఈ మొత్తం శ్రేణి ఉత్పత్తులు నిరూపించబడిన( ఐఈజీఆర్) ఇంటిల్ జెంట్ ఎగ్జాస్ట్ గ్యాస్ రీసర్క్యులేషన్) టెక్నాలజీని బీ ఎస్-4 ఇంజన్లు కలిగి ఉన్నాయి. ఐఈజీఆర్ సాంకేతికత అపిక్లేషన్‌ను దేశీయంగా అభివృద్ధి చేయడం ద్వారా అగ్రగామీగా ఉన్న అశోక్ లేలాండ్ 130 ఎచ్‌పీకి పైన 320 హెచ్‌పి వరకు కలిగిన తమ ఉత్పత్తులలో విజయవంతంగా ఈ సంకేతికతను జొప్పించిన ఒకే ఒక దేశీయ ఓ ఈ ఎంగా నిలిచిందని రాజీవ్ సంఘ్వీ అన్నారు. వినియోగ దారుల కోరికలను జాగ్రత్తగా పరిశీలించడంతో పాటు మా నెట్‌వర్కను స్థిరంగా విస్తరించుకుంటామని ఆయన అన్నారు. దీని ద్వారా తమ వినియోగ దారులకు అత్త్యున్నత కస్టమర్ అనుభవాలను సృష్టించగలుతున్నామని చెప్పారు. దీనితో పాటుగా అశోక్ లేలాండ్ ఉత్పత్తులు అత్యుత్తమ మైలేజ్, పనితీరు అందిస్తున్నామని చెప్పారు. ఫలితంగా అశోక్ లేలాండ్ వాహనాలకు రీసేల్ విలువ ఎక్కువ ఉందన్నారు. దాదాపు 56శాతం మార్కెట్ వాటాతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అగ్రగామీగా ఉన్నట్లు వెల్లడించారు. ఈ రెండు రాష్ట్రాలలో 34 వర్క్‌షాపులు, 50 మొబైల్ సర్వీస్ వ్యాన్స్‌తో కూడిన నెట్‌వర్కు ఉందన్నారు.