బిజినెస్

2019 ద్వితీయార్ధంలో మార్కెట్‌లోకి కియో తొలి ఉత్పత్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం: ప్రఖ్యాత కొరియన్ ఆటోమొబైల్ దిగ్గజం కియో మోటార్స్ భారతదేశంలో తన తొలి ఉత్పత్తిని నవ్యాంధ్ర నుంచి మార్కెట్‌లోకి విడుదల చేసేందుకు సన్నద్ధమవుతోంది. భారతదేశంలో తన తొలి ఉత్పత్తి కర్మాగారాన్ని నవ్యాంధ్రలోని అనంతపురం జిల్లా పెనుగొండ సమీపంలోగల యరమంచిలో ఏర్పాటు చేసిన సంగతి విధితమే. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా కియో సంస్థను రాష్ట్రానికి తీసుకువచ్చింది. ఈ సంస్థ 2017లో పనులను ప్రారంభించి వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో తొలి ఉత్పత్తిని భారత మార్కెట్‌లోకి ప్రవేశపెట్టనుంది. భారత భౌగోళిక పరిస్థితులను తట్టుకునే విధంగా తీర్చిదిద్దిన ఎస్‌వి-2ఐ మోడల్ కార్లను మార్కెట్‌కు పరిచయం చేయనున్నట్టు సంస్థ పౌర సంబంధాల ముఖ్య అధికారి కుష్బూ గుప్త వెల్లడించారు. శరవేగంతో జరుగుతున్న ప్లాంట్ పనులను విలేఖరులకు వివరిస్తూ ప్రపంచ వ్యాప్తంగా విస్తరించిన కియో మోటార్స్ భారతదేశంనే తొలి ఉత్పాదక యూనిట్‌ను ఏపీలోని అనంతపురం జిల్లాలో నెలకొల్పిందన్నారు. ప్రపంచంలో కియో సంస్థ 15వ కార్ల తయారీ కర్మాగారాన్ని 1.1 బిలియన్ యుఎస్ డాలర్ల ఖర్చుతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేస్తున్నామన్నారు. సంవత్సరానికి 3 లక్షల కార్ల ఉత్పత్తి సామర్ధ్యంతో రూపుదిద్దుకుంటున్న ఈ కర్మాగారం అనేక ప్రత్యేకతలతో కూడుకుందని వెల్లడించారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా 10వేల మందికి ఉపాధి కల్పించే ఈ యూనిట్ వెనుకబడిన అనంతపురం జిల్లాకు మకుటాయమానంగా నిలుస్తుందన్నారు. స్థానిక యువతకు ఉపాధి కల్పించేందుకు వీలుగా కియో సంస్థ ప్రత్యేక శిక్షణ కేంద్రాన్ని నిర్వహిస్తోందని, బ్యాచ్‌కు 400 చొప్పున, ఇప్పటి వరకూ 19 బ్యాచ్‌లకు శిక్షణ ఇచ్చామన్నారు. ప్రెస్సింగ్, బాడీ, పెయింట్, అసెంబ్లింగ్ షాప్‌లు పూర్తిగా యాంత్రీకరణతోనే జరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో ప్లాంట్ పనులు శరవేగంతో జరుగుతున్నాయన్నారు. సమావేశంలో సంస్థ ప్రతినిధులు శ్యామ్ సుందర్ జీసీ, పూర్వి పాల్గొన్నారు.

చిత్రం..యరమంచిలోని కియో మోటార్స్ సంస్థ శిక్షణ కేంద్రం