బిజినెస్

కరెన్సీ వివరాలు ప్రకటించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 17: డీ మానిటరైజేషన్ తర్వాత రూ.2000. రూ 500 కరెన్సీ నోట్లు ఎన్ని ముంద్రించారో వివరించడంలో రిజర్వు బ్యాంకు కరెన్సీ నోట్ల ముద్రణ విభాగం విఫలమైందని కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ) సోమవారం పేర్కొంది. దేశ ఆర్థిక స్థితిగతులను ప్రభావితం చేసే ఈ అంశంపై దాపరికం అవసరం లేదని తెలిపింది. కరెన్సీ ముద్రణకు చెందిన వివరాలను ప్రజలతో పంచుకోలేమని రిజర్వుబ్యాంకుకు చెందిన ముద్రణ విభాగం ‘ది భారతీయ రిజర్వుబ్యాంకు నోటు ముద్రణ్ (పి) లిమిటెడ్’ తెలపడం సరికాదని సూచించింది. సోమవారం ఇందుకు ఈ కేసు హియరింగ్‌కు రాగా కేంద్ర సమాచార కమిషనర్ సుధీర్ భార్గవ విచారించారు. 2016 నవంబర్ 8న ప్రధాన మంత్రి మోదీ అనూహ్యంగా రూ.500, రూ.1000 నోట్ల రద్దును ప్రకటించారు.
దేశంలోని మొత్తం చలామణిలో ఉన్న నోట్లలో ఇవి 86 శాతం ఉండగా వీటిని రద్దుచేసిన తర్వాత ప్రత్యామ్నాయంగా 2000, 500ల రూపాయల నోట్లను సరిపడా విడుదల చేయలేకపోయారని పెద్దయెత్తున విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ఏటీఎంలు ఖాళీ అవడంతోబాటు, బ్యాంకులవద్ద భారీగా బారులు తీరిన ఖాతాదారుల పాట్లు వర్ణనాతీతంగా మారిన క్రమంలో ఆ బాధితుల్లో ఒకడైన హరీందర్ ధింగా సమాచార హక్కు చట్టం కింద పొందిన సమాచారం సంతృప్తికరంగా లేకపోవడంతో కేంద్ర సమాచార కమిషన్‌ను ఆశ్రయించారు. 2016 నవంబర్ 9 నుంచి 30 వరకు ముద్రించిన 2000, 500 రూపాయల కరెన్సీ వివరాలను ఆయన కోరారు. అయితే అలాంటి వివరాలను వెల్లడించడం వల్ల దేశ సార్వభౌమత్వానికి, సౌభ్రాతృత్వానికి, రక్షణకు విఘాతం కలుగుతుందని ఆర్బీఐ ముద్రణ విభాగం పేర్కొంది. నోట్ల తయారీ విధానాల గురించిన సమాచారం ఎప్పటికీ గోప్యంగానే ఉండాలని బదులిచ్చింది. అయితే ఆ నష్టాలు ఏవిధంగా సంబవిస్తాయో సవివరంగా చెప్పకపోవడంతో ఫిర్యాదుదారు సంతృప్తి చెందకపోవడంతో వివరాలు వెల్లడించాలని సీఐసీ ఆదేశించింది.