బిజినెస్

కేటీపీపీ రెండో దశకు విరామం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భూపాలపల్లి/గణపురం : జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూర్ సమీపంలో ఉన్న కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రం (కేటీపీపీ) రెండో దశ 600 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్‌ను నిలిపివేసి వార్షిక మరమ్మతులు చేపట్టనున్నారు. గత వారం రోజులుగా రెండో దశలో టర్బన్ జనరేటర్ స్టేటార్‌లో ఏర్పడిన సాంకేతిక సమస్యతో ప్లాంట్‌ను నిలిపవేసిన విషయం తెలిసిందే. తాజాగా సోమవారం జెన్-కో డైరెక్టర్ థర్మల్ లక్ష్మయ్య, కేటీపీపీ సీ ఈ సిద్దయ్యల పర్యవేక్షణలో స్టేటార్ మరమ్మతులను పర్యవేక్షించారు. సాంకేతిక సమస్య బయటపడటంతో పాటు మరమ్మతు పనులు ఆలస్యమయ్యే అవకాశం ఉండటంతో జెన్‌కో యాజమాన్యం ఆదేశాలతో ప్రతి యేడు నిర్వహించే వార్షిక మ్మతులను కూడా టర్బన్ మరమ్మతులతో కలిపి పూర్తి చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. రెండో దశ 600 మెగావాట్ల ప్లాంట్ సీవోడి సమయంలో కూడా ఇదే సమస్య తలెత్తినప్పటికి సుమారు మూడు నెలల్లో మరమ్మతులు పూర్తిచేశారు. తిరిగి మళ్లీ అదే సమస్య పునరావృతం కావడంతో జెన్-కో తీవ్ర నష్టాన్ని చవి చూడాల్సి వస్తోంది. కేటీపీపీ రెండో దశలో పూర్తిస్థాయి విద్యుత్ ఉత్పత్తి అయితే సుమారు రెండు కోట్ల ఆదాయం జెన్-కోకు రానుంది. ప్లాంట్ మరమ్మతులు పూర్తయ్యే నాటికి సంస్థ భారీగా నష్టాన్ని చవిచూడాల్సి వస్తోంది. కేటీపీపీలో ఉన్న మొదటి దశ 600 మెగావాట్లు, రెండో దశ 500 మెగావాట్ల నిర్వహణ సరిగా లేకపోవడం, అధికారుల పర్యవేక్షణ లేకపోవడమే వరుస సాంకేతిక లోపాలు వెంటాడుతున్నాయనే విమర్శలు వినవస్తున్నాయి. కొందరు ఉన్నతాధికారుల స్వంత నిర్ణయాలు, ఒంటెద్దు పోకడల వలన జెన్-కో యజమాన్యం భారీ మూల్యాన్ని చెల్లించుకొని కోట్లల్లో నష్టాన్ని చవిచూస్తోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. స్టేటార్ మరమ్మతులను అడ్డు పెట్టుకొని వార్షిక మరమ్మతుల పేర తప్పుడు సమాచారాన్ని అధికారులు చెబుతున్నారనే మాటలు కూడా వినవస్తున్నాయి.