బిజినెస్

విజయ్ మాల్యాకు న్యాయపర చిక్కులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, డిసెంబర్ 18: పరారీలో ఉన్న వ్యాపారవేత్త విజయ్‌మాల్యాకు న్యాయపరమైన చిక్కులు మరింతగా ముదిరాయి. భారత్‌లో బ్యాంకులను మోసగించి లండన్ పారిపోయిన మాల్యాకు అక్కడి హైకోర్టులోనూ విచారణను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇండియన్ బ్యాంక్స్ కన్సార్టియం మాల్యా మొండి బకాయిలను వసూలు చేసుకునేందుకు చేపట్టిన చర్యల నేపథ్యంలో మాల్యాకు వచ్చే యేడాది ఇంగ్లాండ్ హైకోర్టులో విచారణకు హాజరు కావాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. మాల్యా మొత్తం 1.145 బిలియన్ పౌండ్ల మేర బ్యాంకుల రుణాకు చెల్లించాల్సివుంది. భారతీయ స్టేట్ బ్యాంకు నేతృత్వంలోని 13 బ్యాంకుల తరపున ఈ కేసును ఈ యేడాది గెలిచిన లండన్‌కు చెందిన న్యాయ విభాగం టీఎల్‌టీ ఎల్‌ఎల్‌పీ మాల్యాకు చెందిన పిటిషన్‌ను లండన్ హైకోర్టు ఇన్సాల్వెంట్ జాబితాకు బదలాయించింది. ఈక్రమంలో కేసు విచారణ వచ్చే యేడాది ప్రథమార్థం లో జరిగనుందని లండన్ న్యాయ విభాగం మంగళవారం స్పష్టం చేసింది. ‘బ్యాంకులను మోసగించిన కేసులో మాల్యాపై భారతీయ బ్యాంకుల తరపున గత సెప్టెంబర్ 11న పిటిషన్ వేసిన విషయం వాస్తవమ’ని టీఎల్‌టీ వాటాదారు పాల్ గెయిర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. మాల్యా నివాసం ఉంటున్న ప్రాంతం నార్తాంప్టన్ కౌంటీకి చెందిన లోకల్ కోర్టులో ఈ పిటిషన్ దాఖలైందని, అక్కడి నుంచి ప్రస్తుతం లండన్ హైకోర్టు ఆఫ్ జస్టిస్‌లోని ఇన్‌సాల్వెంట్ జాబితాలోకి విచారణ నిమిత్తం బదలాయింపు జరిగిందని పాల్ గెయిర్ వివరించారు. కాగా గత మేనెలలో ఇంగ్లాండ్ హైకోర్టు న్యాయమూర్తి ఈ కేసుపై విచారణ జరిపిన సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మాల్యా ఆస్తుల స్వాధీనానికి ఆదేశాలిచ్చేందు నిరాకరించారు. అయితే 13 భారతీయ బ్యాంకులతో కూడిన కన్సార్టియం మాల్యా నుంచి అప్పులు వసూలు చేసుకునే విషయంపై దాఖలైన పిటిషన్‌పై మాత్రం న్యాయమూర్తి కేసును యథావిధిగా కొనసాగించుకునే వీలుకల్పించారు. ఈక్రమంలో వచ్చే యేడాది ప్రథమార్థంలో ఈ కేసు హియరింగ్‌కు మాల్యా హాజరుకావాల్సిన పరిస్థితి నెలకొంది. దివాళాతీసిన కింగ్‌ఫిషర్ వైమానిక సంస్థకోసం తీసుకున్న రుణాలను చెల్లించని మాల్యా ప్రస్తుతం బెయిల్‌పై కొనసాగుతున్నారు. ఆయన్ను తిరిగి భారత్‌కు పంపేందుకు లండన్‌కు చెందిన వెస్ట్‌మినిస్టర్ కోర్టు ఆదేశాలు జారీచేయగా అవి ప్రసుత్తం అక్కడి హోం సెక్రటరీ సాజిద్ జావేద్ సంతకం కోసం ఎదురుచూస్తున్నాయి.