బిజినెస్

త్వరలో నగదు రహిత టికెట్ కార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, డిసెంబర్ 18: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్‌ఆర్టీసీ)లో అతి త్వరలో నగదు రహిత టిక్కెట్ కార్డులను ప్రవేశ పెట్టనున్నామని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్వీ సురేంద్రబాబు చెప్పారు. దీనివల్ల ప్రయాణికులకు చిల్లర సమస్య లేకుండా సరిపడా మొత్తాన్ని కార్డులో వినియోగించుకునేందుకు వీలు కలుగుతుందన్నారు. అలాగే త్వరలో అన్ని బస్సుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటుచేస్తామన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఆర్ అండ్ బి అతిథి గృహంలో మంగళవారం ఆర్టీసీ తూర్పు గోదావరి జిల్లా రీజియన్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం మీడియా సమావేశంలో సురేంద్రబాబు మాట్లాడారు. ఆర్టీసీ నష్టాలను అధిగమిస్తూ, ఆదాయాన్ని పెంచుకునే దిశగా పయనిస్తోందన్నారు. టిక్కెట్ల ధరలు పెంచకుండానే ఇతర అంశాలపై దృష్టిపెట్టి ఆదాయాన్ని పెంపొందించుకుంటూ నష్టాలను అధిగమించడానికి చర్యలు చేపట్టామన్నారు. ఆర్టీసీ బస్సు ల్లో ఆక్యుపెన్సీ రేషియో (ఓఆర్) 78 శా తం పెరిగిందన్నారు. గత ఐదారు నెలల్లో వెహికల్ ట్రాకింగ్, పంక్చువాలిటీపై ప్రత్యే క దృష్టిపెట్టామని, ఇప్పటికే 95 శాతం వాహనాలకు ట్రాకింగ్ పూర్తిచేశామన్నా రు. రాష్ట్రంలో ఆర్టీసీ పనితీరు ఆరు నెల ల్లో మెరుగుపడిందన్నారు. సంస్థలో పనిచేస్తున్న 54వేల మంది సిబ్బందిలో ఎవ రూ ఎటువంటి అభద్రతా భావానికి గురికాకుండా సంస్థ పట్ల అంకితభావంతో పనిచేసేవిధంగా ప్రత్యేక దృష్టిసారించామన్నారు. గతంలో ప్రతీ తప్పిదానికి, పొ రపాటుకు నోటీసులిచ్చే పరిస్థితి ఉం డేదని, ఇపుడు కొన్ని ప్రమాణాలతో కూడిన సర్క్యులర్‌ను ముందుగానే వెల్లడించంవల్ల కార్మికుల్లో అభద్రతా భావాన్ని తొలగించి నిశ్చింతగా, సంస్థ పట్ల అంకితభావంతో పనిచేసేవిధంగా మార్చామన్నారు. ఆర్టీసీలో సిబ్బందినెవరినీ అర్ధాంతరంగా తొలగించబోమని, వారి ఉద్యోగ భద్రత కు ఢోకాలేదన్నారు. ఏడాదికి రెండు వేల మంది సిబ్బంది రిటైరయ్యే పరిస్థితి వుం దని, అటువంటి సందర్భంలో ఖర్చులను తగ్గించుకోవడానికి అవుట్ సోర్సింగ్ సి బ్బందిని నియమించుకుంటున్నామన్నా రు. అలాగే పదవీవిరమణ చేసిన ఉద్యోగుల పింఛను సెటిల్‌మెంట్లు గత ఏడాదిన్నర కాలంగా పెండింగ్‌లో ఉన్నవి పరిష్కరించి, ఇకపై ఎప్పటికప్పుడు సెటిల్ చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నా రు. డీఏ ప్రభుత్వం ప్రకటించిన వెంటనే చెల్లించే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు. ఆర్టీసీ నష్టాలకు ప్రధాన కారణం డీజిల్ ధరలు పెరగడమేనని ఎండీ సురేంద్రబాబు అన్నారు. టిక్కెట్ ధరలు పెంచకుండానే ఆదాయాన్ని పెంపొందించుకునే విధానాలపై ఆర్టీసీ దృష్టిపెట్టిందన్నారు. ఇందులో భాగంగా కార్గొను విస్తృతంచేసి మరింత ఆదాయాన్ని సముపార్జించుకునే విధంగా చర్యలుచేపట్టామన్నారు. రెండేళ్ల క్రితం కార్గో ద్వారా రూ.9 కోట్లు ఆదాయం లభిస్తే అది గత ఏడాది రూ.43 కోట్లకు, ఈ ఏడాది రూ.75 కోట్ల కు చేరిందన్నారు. మరింత ఆదాయాన్ని పెంచుకోవడంలో భాగంగా బస్సు రూట్లలోని మండల కేంద్రాల నుంచి కూడా కార్గోను నిర్వహించే విధంగా ఆసక్తిగల ఏజెంట్లను ఏర్పాటుచేయడానికి చర్యలు చేపట్టామన్నారు. ప్రతీ ఏడాది కొత్త బ స్సుల కోసం రూ.200 కోట్లు కేటాయిస్తున్నామన్నారు. సమావేశంలో ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆపరేషన్స్ జయరావు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అడ్మినిస్ట్రేషన్ కోటేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పర్సనల్ వెంకటేశ్వరరావు, రీజినల్ మేనేజర్ సిహెచ్ రవికుమార్, డీఎం ఎం పెద్దిరాజు తదితరులు పాల్గొన్నారు.
చిత్రం..విలేఖర్లతో మాట్లడుతున్న ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబు