బిజినెస్

పెట్టుబడులకు నెదర్లాండ్స్ సుముఖత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: ఐటీ, ఐటీఈఎస్, క్రీడలు, వౌలిక సదుపాయాలు, విద్యుత్ తదితర రంగాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు, సాంకేతిక సహకారాన్ని అందించేందుకు నెదర్లాండ్స్ సంస్థలు ఆసక్తి కనబరిచాయి. ఈ విషయాలను మంగళవారం ఉండవల్లి ప్రజావేదికలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుతో జరిగిన సమావేశంలో నెదర్లాండ్స్ రాయబారి మార్టెన్ వాన్ డెన్‌బర్గ్ వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు సంసిద్ధత వ్యక్తం చేస్తున్న 17 సంస్థల ప్రతినిధులను డెన్‌బర్గ్ ముఖ్యమంత్రికి పరిచయం చేశారు. తొలిసారిగా తాను ఆంధ్రప్రదేశ్‌లో పర్యటిస్తున్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌కు నెదర్లాండ్స్‌కు అనేక అంశాల్లో సారూప్యత ఉందన్నారు. విద్య, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగాల్లో పెట్టుబడులకు ఆసక్తి ఉందని, వాటర్ వేస్, వేస్ట్‌టు ఎనర్జీ, వేస్ట్ వాటర్, యానిమల్ న్యూట్రిషన్, స్మార్ట్‌సిటీ, సాఫ్ట్‌వేర్, ఇంధన రంగాల్లో ఈ సంస్థలకు అనుభవం ఉందని డెన్‌బర్గ్ ముఖ్యమంత్రికి దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్న అవకాశాలను నెదర్లాండ్స్ సంస్థల ప్రతినిధులకు ముఖ్యమంత్రి వివరించారు. సమర్థత, ఆకర్షణ, సులభతర వాణిజ్యం నెదర్లాండ్స్ సొంతమని, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో భారతదేశంలోనే అగ్రగామిగా ఉందని తెలిపారు. ఐటీ, ఐవోటీ, ఇంథన రంగాల్లో తమ రాష్ట్రం ముందంజలో ఉందన్నారు. సాంకేతిక సాయంతో తుపాన్ల గమనాన్ని ముందుగానే పసిగట్టి నష్టనివారణ చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఉత్తమ మానవ వనరులు, సులభతర వాణిజ్య అవకాశాలు, సమృద్ధిగా విద్యుత్, నీరు ఇక్కడి కలిసొచ్చే అంశాలన్నారు. సోలార్ విద్యుత్ ఉత్పత్తిపై దృష్టిపెట్టటం ద్వారా యూనిట్ విద్యుత్ ఉత్పత్తికి అయ్యే ఖర్చును తగ్గించ గలిగామన్నారు. ప్రాజెక్ట్‌లలో సెన్సర్లు ఏర్పాటు చేయటం ద్వారా నీటినిల్వల గణాంకాలు తెలుసుకోగలుగుతున్నామని తెలిపారు. ఎలక్ట్రికల్ వాహనాలను ప్రోత్సహించడం ద్వారా కాలుష్యాన్ని నియంత్రించాలని నిర్ణయించామని వివరించారు. పెట్టుబడిలేని ప్రకృతి వ్యవసాయం నూరు శాతం చేపట్టటం తమ లక్ష్యంగా, ప్రపంచంలో ఎక్కడా లేనట్టు విస్తారంగా సహజ సిద్ధమైన సాగును రాష్ట్రంలో చేపట్టామని చెప్పారు. భారతదేశ వృద్ధిరేటు కంటే అధికంగా రెండంకెల వృద్ధితో ఆంధ్రప్రదేశ్‌ను ముందుకు నడిపిస్తున్నామని నూతన రాష్ట్రంలో నూతన రాజధాని అమరావతిని నిర్మించుకుంటున్నామని తెలిపారు. అమరావతిలో వౌలిక వసతుల కోసం వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నట్లు చెప్పారు. రాష్టమ్రంతటా ఎల్‌ఈడీ వీధి దీపాలు ఏర్పాటు చేస్తున్నామని 16లక్షల సోలార్ పంపుసెట్లు అమర్చడం ద్వారా వ్యవసాయానికి వినియోగించే విద్యుత్ ఆదా అవుతోందని తెలిపారు. రియల్‌టైమ్ గవర్నెన్స్ వ్యవస్థ మరెక్కడా లేదని చెప్తూ దేశంలో ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ఏపీ తరహాలో ‘పరిష్కారవేదిక’ కాల్ సెంటర్ లేదని, ఇది తమ రాష్ట్రానికే ప్రత్యేకమని ముఖ్యమంత్రి వివరించారు. టెక్నాలజీని సమర్థవంతంగా వినియోగించుకోవటం ద్వారా పెథాయ్ తుపానులో ప్రాణనష్టం జరక్కుండా చూడగలిగామన్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరి హెల్త్ ప్రొఫైల్ భద్రపరుస్తున్నాం.. మనం తీసుకునే ఆహారమే ఔషధంగా పనిచేయాలి..అందరికీ పౌష్టికాహారం అందించేందుకు కృషి జరుగుతోందని తెలిపారు. బియ్యానికి మరిన్ని పోషక విలువలు జోడించటంలో తమకు నైపుణ్యం ఉందని, ఏపీకి సాంకేతికత అందించి ఫార్టిఫైడ్ రైస్ ఉత్పత్తి చేస్తామని ఓ సంస్థ ప్రతినిధి ముందుకొచ్చారు. నెదర్లాండ్స్ సంస్థల ప్రతినిధుల ముఖాముఖి పాక్వెస్ ఎన్విరానె్మంటల్, కాబా ఇన్‌ఫ్రాటెక్, రాయల్ హోస్కోనింగ్, డీ హెచ్‌వీ, వాన్ ఊర్ద్ ఇండియా, కంపేక్ ఐటీ, ఎకోబ్లిస్ ప్యాకేజింగ్, ట్రో న్యూట్రిషన్, ఎఫ్1 స్టూడియోస్, స్విచ్‌గేర్ అండ్ స్ట్రక్చర్స్, మావిటెక్, డీహ్యూస్ యానిమల్ ఫీడ్, డీఎస్‌ఎం, ప్లానాన్ ఇండియా, ఫోరమ్ రీసెర్చ్, అలార్ గ్రూప్, సోలిదరిదాద్, ఈఫ్రెష్ ఇండియా సంస్థల ప్రతినిధులు ముఖ్యమంత్రితో ముఖాముఖి చర్చించారు. వేస్ట్ వాటర్ ట్రీట్‌మెంట్, వాటర్ మేనేజ్‌మెంట్, క్వాలిటీ డ్రింకింగ్ వాటర్ టెక్నాలజీని ఏపీకి అందిస్తామని వెల్లడించారు. ఏపీ అభివృద్ధికి సహా య, సహకారాలు అందించాలని, నవ్య ఆలోచనలు, ఆవిష్కరణలు, వినూత్న సాంకేతికత అందించాలని ముఖ్యమంత్రి కోరారు.
చిత్రం..ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడితో సమావేశమైన నెదర్లాండ్స్ ప్రతినిధి బృందం