బిజినెస్

89 లక్షల టన్నుల నూనె గింజలు పప్పు ధాన్యాల కొనుగోలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 5: 2015-16 ఆర్థిక సంవత్సరం నుంచి గడచిన డిసెంబర్ వరకు కేంద్ర ప్రభుత్వం మొత్తం 89 లక్షల టన్నుల నూనె గింజలను, పప్పు దినుసులను కొనుగోలు చేసింది. ఈ కొనుగోళ్లు తదుపరి కూడా కొనసాగుతాయని శుక్రవారం రాజ్యసభలో వ్యవసాయ శాఖ మంత్రి రాధా మోహన్ సింగ్ వెల్లడించారు. ప్రశ్నోత్తరాల సెషన్‌లో సభ్యుడు అడిగిన ప్రశ్న కు ఎగువ సభలో మంత్రి సమాధానమి స్తూ గడచిన 2010-2013 కాలంలో 8లక్షల టన్నులు మాత్రమే కొనుగోలు చేయగా గడచిన మూడేళ్ల కాలంలో ఈ కొనుగోళ్లు గణనీయంగా పెరిగాయని తెలిపారు. పీఎస్‌ఎస్ ద్వారా ఈ కొనుగోళ్లు జరుగుతున్నాయని వివరించారు. కాగా మరో ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఉత్తర్‌ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో రైతు ఉత్పత్తులకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) కల్పనకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నామని వివరించారు. అధిగ దిగుబడుల కారణంగా బంగాళా దుంప లాంటి పలు ఉత్పత్తుల ధరలు తగ్గుముఖం పట్టినపుడు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టి రైతులను ఆదుకున్నట్టు తెలిపారు.