బిజినెస్

కొలంబియాలో చమురు అనే్వషణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 5: మన దేశంలోని ఆయిల్ అండ్ నాచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్‌జీసీ)కి చెందిన ఓఎన్‌జీసీ విదేష్ లిమిటెడ్ (ఓవీఎల్) దక్షిణ అమెరికాలోని కొలంబియాలో చమురు అనే్వషణకు శ్రీకారం చుట్టింది. తాజాగా జరిపిన అనే్వషణలో రెండవ చమురు నిక్షేపాలను కనుగొన్నట్టు ఓఎన్‌జీసీ శనివారం తెలిపింది. సముద్రతీర ప్రాంతంలోని సీపీఓ-5 బ్లాక్‌లో గల ఇండికో-1 బావిలో ఈ చమురు నిక్షేపాలు కనుగొన్నట్టు పేర్కొంది. ఇందులో ఓవీఎల్ 70 శాతం వాటాను దక్కించుకోగా, మిగిలిన 30 శాతం కొలంబియాకు చెందిన పెట్రోడొరాడో సౌత్ అమెరికా ఎస్.ఏ.సుకుర్సన్ (పీడీఎస్‌ఏ) దక్కించుకోనుందని తెలిపింది. ఈ బావిని గత ఏడాది నవంబర్ 7న కనుగొనగా, తమ కంపెనీ డిసెంబర్ 15 నుంచి డ్రిల్లింగ్ పనులు చేపట్టేందుకు శ్రీకారం చుట్టిందని పేర్కొంది. భూగర్భంలో 9,833 అడుగుల లోతున చమురు నిక్షేపాలు ఉన్నట్టు తెలిపింది. చమురు పరీక్షల సమయంలో రోజుకు కనీసం 4,000 బ్యారెల్స్ వంతున చమురును తీయవచ్చునని ప్రాథమిక అంచనాకు వచ్చామని పేర్కొంది. ప్రస్తుతం ఆ చమురు బావి ప్రాంతం పరీక్షల్లోనే ఉందని, దీనిపై పూర్తిగా అవగాహనకు వచ్చిన తర్వాత రోజుకు ఎంతమేరకు చమురు నిల్వలను బయటకు తీయవచ్చుననే తుది అంచనాకు వస్తామని తెలిపింది. కాగా, ఓవీఎల్ గతంలో ఇండికో-1 ప్రాంతానికి 6.5 కిలోమీటర్ల దూరంలోని మరిపోసా-1 బావిలో బ్లాకులో చమురు నిక్షేపాలు ఉన్నట్టు కనుగొంది. భవిష్యత్తులో మరిన్ని బావులను కనుగొని తవ్వకాలు జరిపేందుకు తమ కంపెనీ తగిన ప్రణాళికలు రూపొందిస్తోందని తెలిపింది.