బిజినెస్

నిరాశాజనకంగా స్టాక్ మార్కెట్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జనవరి 5: కొత్త సంవత్సరం మొదటి వారం భారత స్టాక్ మార్కెట్ అనుకున్నంత ఆశాజనకంగా కొనసాగలేదు. చివరిలో కొంత మెరుగుపడి, లాభాల బాట పట్టినప్పటికీ, స్థూలంగా చూస్తే బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ)లో లావాదేవీలు ఆశాజనకంగా లేవనే చెప్పాలి. వారం చివరి రోజైన శుక్రవారం 181.39 పాయింట్లు ఎగబాకి, 35,695.10 పాయింట్ల వద్ద ముగిసిన విషయం తెలిసిందే. వరుస నష్టాల నుంచి బయటపడిందన్న ఊరట తప్ప, అంతర్జాతీయ సూచీల కారణంగా స్టాక్ మార్కెట్‌కు నిరాశజనకమైన ఫలితాలు తప్పలేదు. వరుసగా రెండు రోజుల పతనం కారణంగా, ట్రేడింగ్‌కు చివరి రోజున కూడా అదే పరిస్థితి తప్పదనే అంతా అనుకున్నారు. కానీ, లావాదేవీలు మొదలైన తర్వాత అమ్మకాల ఒత్తిడి తగ్గింది. దేశీయ మదుపరులు ఆసక్తిని ప్రదర్శించడంతో కొనుగోళ్లు క్రమంగా పెరిగాయి. దీనితో లాభపడిన సెనె్సక్స్‌తోపాటు సిఫ్టీ కూడా 55.10 పాయింట్లు మెరుగుపడి 10,727.35 పాయింట్లుగా నమోదైంది.
స్థూలంగా చూస్తే, లావాదేవీల వారాంతపు లావాదేవీలు ఆశాజనకంగానే ఉన్నప్పటికీ, స్థూలంగా పరిశీలిస్తే సెనె్సక్స్ ఒడిదుడుకుల ప్రస్థానాన్ని కొనసాగించిందనే చెప్పాలి. వారం మొత్తంలో సెనె్సక్స్ 381.62, నిఫ్టీ 132.55 పాయింట్లు నష్టపోంది. శని, ఆదివారాలు స్టాక్ మార్కెట్‌కు సెలవు కావడంతో, సోమవారం నుంచి ప్రారంభం కానున్న కొత్త వారంలో ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది ఆసక్తిని రేపుతున్నది. రాబోయే వారంలో అమెరికా, చైనా మధ్య వాణిజ్య పరమైన చర్చలు ప్రారంభం కానుండడంతో అంతర్జాతీయ మార్కెట్ ట్రెండ్స్ సానుకూల ధోరణను ప్రదర్శిస్తున్నాయి. అమెరికాకు చెందిన అధికారుల బృందం వచ్చే వారం చైనా వెళ్లనుంది. ఇప్పటికే అమెరికా, చైనా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్, జీ జింగ్‌పిన్ ద్వైపాక్షిక వాణిజ్య చర్చలకు సానుకూలత వ్యక్తం చేయడంతో, ఇరు దేశాల అధికారుల చర్చలు సత్ఫలితాలనిస్తాయనే నమ్మకం వ్యక్తమవుతున్నది. రెండు దేశాల మధ్య కొంత కాలంగా కొనసాగుతున్న వాణిజ్య యుద్ధానికి తెరపడుతుందన్న నమ్మకం మార్కెట్ వర్గాల్లో కనిపిస్తున్నది. మొత్తం మీద అమెరికా, చైనా దేశాలు వాణిజ్యపరమైన అవగాహనకు వస్తాయనే అభిప్రాయం ప్రపంచ మార్కెట్‌ను, తత్ఫలితంగా భారత మార్కెట్‌ను ప్రభావితం చేసింది. ఈ చర్చలు విజయవంతమైతే, బీఎస్‌ఈ కూడా తిరిగి లాభాల బాట పట్టడం ఖాయం. ముడి చమురు ధర తగ్గడం, రూపాయి మారకపు విలువ బలడడం వంటి అంశాలు కూడా సెనె్సక్స్‌ను లాభాలబాట పట్టించడం ఖాయం. ప్రస్తుతం మా ర్కెట్‌లో సానుకూల ధోరణలు కనిపిస్తున్నప్పటికీ, వచ్చే వారం లావాదేవీలు మొదలైన తర్వాత ఏఏ సెంటిమెంట్లు, ఎంతెంత బలమైన పాత్రలు పోషిస్తాయనే దానిపైనే బీఎస్‌ఈ ట్రెండ్స్ ఆధారపడి ఉంటా యి. ఖచ్చితంగా లాభాలను ఆర్జిస్తాయని చెప్పలేకపోయినా, ట్రెండ్ సానుకూలంగానే ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
పింక్ క్యాప్‌లతో మైదానంలోకి..
సిడ్నీ, జనవరి 5: ఆసీస్‌తో జరుగుతున్న చివరి టెస్టులో మూడో రోజు కోహ్లీ సేన పింక్ టోపీలతో మైదానంలోకి దిగింది. క్యాన్సర్‌పై అవగాహన కల్పించేందుకు మూడో రోజును పింక్ డే గా పాటించారు. అలాగే ఆస్ట్రేలియా లెజెండరీ బౌలర్ గ్లెన్ మెక్ గ్రాత్ ఫౌండేషన్‌కు విరాళాల కోసం గౌరవ సూచకంగా టీమిండి యా ఈ క్యాప్‌లను ధరించింది. మెక్‌గ్రాత్ భార్య జేన్ మెక్‌గ్రాత్ 2008లో క్యాన్సర్‌తో పోరాడుతూ మృతి చెందింది. మెక్‌గ్రాత్ తన భార్య అనారోగ్యంతో ఉన్న రోజుల్లోనే 2005లో మెక్‌గ్రాత్ ఫౌండేషన్‌ను స్థాపించాడు. ఈరోజు వచ్చిన విరాళాలను క్యాన్సర్ బాధితులకు మెక్‌గ్రాత్ ఫౌండేషన్ ద్వారా అందిస్తారు.