బిజినెస్

మార్కెట్ పయనం ఎటు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జనవరి 6: స్టాక్ మార్కెట్ పయనం ఎటు? ఈ ఏడాది మొదటి వారం అనిశ్చితిలో కొనసాగిన బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ) లావాదేవీలు రాబోయే వారంలోనైనా కోలుకుంటాయా? అమెరికా, చైనా దేశాలకు చెందిన ప్రతినిధులు ద్వైపాక్షిక వాణిజ్య అంశాలపై జరపబోయే చర్చలు ఎంత వరకు ఫలిస్తాయి? వాటి ప్రభావం భారత స్టాక్ మార్కెట్‌పై ఏ స్థాయిలో ఉంటుంది? విదేశీ పెట్టుబడిదారులు వెనుకంజ వేస్తే, దేశీయ మదుపరులు ఆదుకునే అవకాశం ఉందా? ఇలాంటి సవాలక్ష ప్రశ్నలతో స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ సోమవారం నుంచి మొదలుకానుంది. అంతర్జాతీయ సూచీలు సానుకూలంగా వ్యవహరిస్తాయని, ఫలితంగా బీఎస్‌ఈలోనూ ట్రేడింగ్ లాభసాటిగా మారుతుందని విశే్లషకులు అంచనా వేస్తున్నారు. అయితే, ఇది ఎంత వరకూ వాస్తవ రూపం దాలుస్తుందనేది అనుమానమే. నిజానికి, అంతర్జాతీయ మార్కెట్ క్రమంగా కోలుకుంటున్నది. అమెరికా, చైనా దేశాల మధ్య చర్చలు సఫలమైతే, ఆ రెండు దేశాల మధ్య వాణిజ్యపరమైన ఉద్రిక్తతలు తగ్గుముఖం పడతాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసిస్తున్న ఈ రెండు దేశాల జరిగే చర్చలు, తీసుకునే చర్చలపైనే భారత్‌సహా మిగతా దేశాల వ్యాపార, వాణిజ్యాలు ఆధారపడతాయన్నది వాస్తవం. అయితే, గతంలో విదేవీ సూచీలు ప్రతికూలంగా వ్యవహరించినప్పటికీ, దేశీయంగా మదుపరులు వాటాల కొనుగోళ్ల పట్ల ఆసక్తిని ప్రదర్శించడంతో, సెనెక్స్ భారీ నష్టాల నుంచి బయటపడింది. కొన్ని సందర్భాల్లో స్వల్పంగా నష్టపోతే, మరికొన్ని సమయాల్లో లాభాలను కూడా నమోదు చేసింది. బలమైన ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్న భారత్‌లో దేశీయ పెట్టుబడిదారుల పాత్ర తక్కువేమీ కాదు. స్టాక్ మార్కెట్ పతనాన్ని అడ్డుకునే బాధ్యతను ఎన్నో సందర్భాల్లో వారు తీసుకున్నారు. వచ్చే వారం స్టాక్స్ లావాదేవీల్లో వీరు ఏ విధంగా స్పందిస్తారన్నది ఆసక్తిని కలిగిస్తున్నది.
నష్టాల నుంచి బయటపడేనా?
గత వారం భారీగా నష్టపోయిన కంపెనీలకు ఊరట లభిస్తుందా? అవి నష్టాల బాటను వీడి మళ్లీ లాభాలను పండిస్తాయా? అనే ప్రశ్నలకు సమాధానాలను వెతుక్కోవాల్సిన అవసరం ఏర్పడింది. గత వారం గణాంకాలను పరిశీలిస్తే, దేశంలోని పది పది ప్రముఖ కంపెనీల్లో ఆరు కంపెనీలు నష్టాలను ఎదుర్కొన్నాయి. ఈ ఆరు కంపెనీల ష్టాక్స్ పతనం 38,152.86 కోట్ల రూపాయలుగా నమోదైంది. స్టాక్స్ భారీగా పతనమైన కంపెనీల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (రిల్) మొదటి స్థానంలో ఉండడం గమనార్హం. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హిందుస్థాన్ యూనీ లెవర్ (హెచ్‌యూఎల్), ఇండియన్ టొబాగో కంపెనీ (ఐటీసీ), హెచ్‌డీఎఫ్‌సీ మార్కెట్ క్యాపిటైలేజేషన్ నష్టాలను ఎదుర్కొన్నాయి. కాగా, ఇన్ఫోనిస్, ఎస్‌బీఐ, కోటక్ మహీంద్ర, ఐసీఐసీఐ బ్యాంక్ లాభాలను సంపాదించాయి. ఈ కంపెనీల లాభాలను నామమాత్రంగా ఉండగా, ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొన్న కంపెనీల నష్టం మాత్రం భారీగా ఉంది. రిల్ 16,955.65 కోట్ల రూపాయలు నష్టపోవడంతో, దాని మార్కెట్ విలువ 6,96,639.64 కోట్ల రూపాయలకు పడిపోయింది. హెచ్‌యూఎల్ మార్కెట్ విలువ 8,626.12 కోట్ల రూపాయలు తగ్గి, 3,85,361.62 కోట్ల రూపాయలకు చేరింది. టీసీఎస్ నష్టం 8,198.96 కోట్ల రూపాయలుగా నమోదైంది. ఫలితంగా ఈ కంపెనీ మార్కెట్ విలువ 7,03,178.13 కోట్ల రూపాయలకు పతనమైంది. 1,501.96 కోట్ల రూపాయలు నష్టపోయిన హెచ్‌డీఎఫ్‌సీ విలువ గత వారాంతానికి 3,38,933.58 కోట్ల రూపాయలుగా ముగిసింది. ఐటీసీ 1,469.63 కోట్ల రూపాయల నష్టంతో, 5,75,922.87 కోట్ల రూపాయలకు పడిపోయింది. ఈ కంపెనీలు వచ్చే వారం ఎలాంటి ఫలితాలను నమోదు చేస్తాయన్నదే ఇప్పుడు మార్కెట్‌లో అందరినీ వేధిస్తున్న ప్రశ్న. అదే విధంగా గత వారం ఐసీసీఐ బ్యాంక్ 2,906.87 కోట్లు, ఇన్ఫోసిస్ 1,376.12 కోట్లు, కోటక్ మహీంద్ర 391 కోట్ల రూపాయలు చొప్పున లాభాలను సంపాదించాయి. ఈ కంపెనీల షేర్లు వచ్చే వారం కూడా అదే దూకుడును కొనసాగిస్తాయా లేక ప్రతికూల పవనాలను ఎదుర్కొంటాయా అన్నది కూడా చూడాలి. మొత్తం మీద గత వారం నష్టాలు, అనిశ్చితుల మధ్య కొనసాగిన స్టాక్ మార్కెట్ ఈ వారం గాడిలో పడుతుందా అన్నది ప్రస్తుతానికి సమాధానం లేని ప్రశే్న.