బిజినెస్

ఆధార్‌తో అంతా ఆదాయే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఆధార్ విధానాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయడం వల్ల మన దేశ ఆర్థిక రంగంపై పెనుమార్పును చూపిందని, ఈ పథకం ద్వారా ఆదా చేసిన డబ్బుతో ఇప్పుడు దేశంలో అమలవుతున్న ఆయుష్మాన్‌భారత్ లాంటి మూడు పెద్ద సంక్షేమ పథకాలకు నిధులను సమకూర్చుకోవచ్చునని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ తెలిపారు. ఈ పథకం యూపీఏ హయాంలో ప్రవేశపెట్టినా సొంత వారి నుంచి ఎదురైన అడ్డంకులు, నిలకడలేని వైఖరి కారణంగా దానిని పూర్తి చిత్తశుద్ధితో అమలు చేయలేకపోయిందని, కాని ప్రధాని నరేంద్రమోదీ దృఢ చిత్తంతో నిర్నయాత్మకంగా దానిని అమలు చేయడంతో దేశంలో పూర్తిగా అమలవుతూ విజయవంతం అయిందని ఆయన ఫేస్‌బుక్‌లో వ్యాఖ్యానించారు. ‘ఆధార్‌తో లాభాలు-నేడు ఎలా అమలవుతోంది’ పేరుతో రాసిన పోస్టులో మనదేశంలో ఆధార్‌ను అమలు చేయడం వల్ల గత ఏడాది మార్చి 31వరకు 90 వేల కోట్లను ఆదా జేయగలిగామని అన్నారు. పలు సంక్షేమ పథకాల్లో నకిలీ లబ్ధిదారులను అరికట్టడం, రెండుసార్లు అంతకన్నా ఎక్కువసార్లు లబ్ధి పొందడం తదితరమైనవి తొలగించడం వల్ల భారత్‌కు ప్రతిఏటా 77 వేల కోట్ల రూపాయలు ఆదా అవుతున్నాయని వరల్డ్ బ్యాంక్ తన నివేదికలో పేర్కొందని ఆయన చెప్పారు. ఈ ఆదా చేసిన మొత్తంతో భారత్‌లో ఇప్పుడు అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ లాంటి పథకాలు మూడు అమలు చేయవచ్చునని అన్నారు. ఇప్పటికే తాము ప్రవేశపెట్టిన ఆయుష్మాన్‌భవ పథకం పేదలకు ఎంతో లబ్ధి చేకూర్చుతోందని ఆయన చెప్పారు. పేదలకు ఖరీదైన వైద్యం కూడా అందుబాటులో ఉండాలన్న లక్ష్యంతో తాము ప్రవేశపెట్టిన ఈ పథకంలో 10.74 కోట్ల మందికి ఆరోగ్య బీమా లభిస్తుందని ఆయన తెలిపారు. దీని ద్వారా పేదలకు ఐదు లక్షల రూపాయల వరకు ఆరోగ్య సేవలు కార్పొరేట్ సహా అన్ని అసుపత్రులలో అందుతుందన్నారు. గత ఏడాది సెప్టెంబర్‌లో ప్రవేశపెట్టిన ఈ పథకం ద్వారా ఇప్పటివరకు సుమారు ఏడు లక్షల మంది పేద రోగులు ఉచితంగా ఆసుపత్రులలో చికిత్స పొందారని ఆయన వివరించారు.
వాస్తవానికి ఆధార్‌ను ప్రవేశపెట్టిన యూపీఏ ప్రభుత్వం ఆ వ్యవస్థను పూర్తి చిత్తశుద్ధితో అమలు చేయలేకపోవడం వల్ల దానికి సంబంధించిన క్రెడిట్‌ను పొందలేకపోయిందని జైట్లీ వ్యాఖ్యానించారు. ఆధార్ సాంకేతిక పరిజ్ఞానంలో లోపాలున్నాయని, దాని అమలుతో అనేక ఇబ్బందులు వస్తాయని కాంగ్రెస్ పార్టీకి చెందిన న్యాయవాదులే దీనిపై పలు కేసులు వేశారని ఆయన ఈ సందర్భగా గుర్తు చేశారు. కాని మోదీ చిత్తశుద్ధితో, కృతనిశ్చయంతో దీనిని అమలు చేయడం వల్ల పూర్తిగా విజయవంతమైందని, సుప్రీం కోర్టు తీర్పు కూడా తమకు అనుకూలంగా వచ్చిందని ఆయన చెప్పారు. ఆధార్ విధానం ద్వారా ఇప్పుడు బదిలీ అవుతున్న సబ్సిడీ మొత్తాల విలువ 1,69,868 కోట్ల రూపాయలని, ఎలాంటి దళారులు లేకుండా పలు పథకాలకు సంబంధించిన సబ్సిడీ మొత్తం లబ్ధిదారుల ఖాతాలోకి నేరుగా జమ అవుతోందని మంత్రి జైట్లీ తెలిపారు. ఇలాంటి విధానం ప్రపంచంలోని కేవలం భారత్‌దేశంలో మాత్రమే ఉందని ఆయన అన్నారు. 2016లో ప్రవేశపెట్టిన ఆధార్ వ్యవస్థలో ఇప్పటివరకు 122 కోట్ల మంది నమోదయ్యారన్నారు. 18 ఏళ్లుదాటిన వారిలో 99 శాతం మందికి పైగా దీనిలో నమోదై ఉన్నారని చెప్పారు. 22.80 కోట్ల పహల్, ఉజ్వల లబ్ధిదారులకు గ్యాస్ సబ్సిడీ నేరుగా వారి ఖాతాల్లోకే జమవుతోందని అన్నారు. అలాగే 58.24 కోట్ల రేషన్‌కార్డుదారులను ఆధార్‌తో లింక్ అయ్యాయని, 10.33 ఎంజిఎన్‌ఆర్‌ఇజిఏ కార్డుదారులను, 63.52 కోట్ల బ్యాంక్ ఖాతాలను కూడా ఆధార్‌తో అనుసంధానం చేశామన్నారు. ఆదాయపు పన్ను శాఖ వారు ఇప్పటికే 21 కోట్ల పాన్‌కార్డులను ఆధార్‌తో అనుసంధానం చేశారన్నారు. ఆధార్ ప్రాధికార సంస్థ యుఐడిఏఐ రోజుకు పది కోట్ల లావాదేవీలు జరిపే సామర్థ్యం కలిగి ఉన్నా, దానిద్వారా ప్రస్తుతం రోజుకు 2.7 కోట్లు మాత్రమే జరుగుతున్నాయని కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీ తెలిపారు.