బిజినెస్

గోల్డెన్ పరివార్ హోల్డింగ్స్‌పై సెబీ కొరడా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 9: కొల్‌కతాకు చెందిన గోల్డన్ పరివార్ హోల్డింగ్ అండ్ డెవలపర్స్ సంస్థతోబాటు దానికి సంబందించిన ఏడు ప్రమోటింగ్ సంస్థలు ప్రజల నుంచి నిధులు సమీకరించకూడదంటూ మార్కెట్ రెగ్యులేటర్ సెబీ ఆంక్షలు విధించింది. ఈ సంస్థలు అక్రమ పద్ధతుల్లో నిధుల సమీకరణ చేస్తున్నాయన్న ఫిర్యాదుల నేపథ్యంలో సెబీ ఈ ఆంక్షల కొరడా ఝళిపించింది. నిధులిచ్చిన వారికి తిరిగి చెల్లించే మిషతో ఆస్తుల విక్రయాలకు పాల్పడటం వంటి కార్యక్రమాలు చేయకూడదని సైతం సెబీ ఆ సంస్థను ఆదేశించింది. 2011-12 సంవత్సరంలో గోల్డెన్ పరివార్ సంస్థ తొలుత 54 మందికి, తర్వాత 66 మంది వద్ద 11 లక్షల రూపాయలు తీసుకుని ప్రాధాన్యతగల మార్చుకో దగిన వాటాల (ఆర్‌పీఎస్)ను అందజేసిందని, ఆ తర్వాత కూడా మరో 49 మందికి షేర్లు విక్రయించింది. అయితే గుర్తింపు పొందిన స్టాక్ ఎక్చేంజీ సెక్యూరిటీ జాబితాల్లో ఇందుకు సంబంధించి నమోదు చేసుకున్న తర్వాతే ఆర్‌పీఎస్‌కు వెళ్లాలన్న నిబంధనలను గొల్డెన్ పరివార్ సంస్థ ఉల్లంగించిందన్న ఆరోపణలు వచ్చాయని సెబీ పేర్కొంది. అలాగే కంపెనీల చట్టం ప్రకారం రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్‌ఓసీ)లో నమోదు చేసుకోవాల్సివున్నా ఆ విషయాన్ని కూడా ఉల్లంఘించిందని సెబీ తన మధ్యంతర ఉత్వర్వుల్లో పేర్కొంది. కాగా ఈ కంపెనీతోబాటు, సంబంధిత ప్రమోటర్లు సుకళ్యాణ్ బిశ్వాస్, దేబామితా బిశ్వాస్, బీనా బిశ్వాస్, సుస్మితా బిస్వాస్, సుప్రకాష్ బిశ్వాస్, సుశ్యామల్ బిశ్వాస్, సుకుమార్ బిశ్వాస్‌లకు సెబీ నోటీసులు తాఖీదులు జారీ చేసింది. నిధులు ఇచ్చిన ప్రజలకు వడ్డీలతో సహా తిరిగి చెల్లించాలని ఎందుకు ఆదేశించకూడదో తెలపాలని పేర్కొంది. అంతేకాక ప్రెస్‌మేన్ అడ్వర్టయిజింగ్ లిమిటెడ్‌లో షేర్ల విక్రయానికి అక్రమ పద్ధతులు అనుసరించారంటూ ఆ సంస్థ యజమాని ప్రవీణ్‌కుమార్ అగర్వాల్‌కు 7లక్షల రూపాయల జరిమానా విధిస్తూ సెబీ ఆదేశాలు జారీ చేసింది.