బిజినెస్

అమెరికా నుంచి 14వేల అనస్తేషియా ఇంజక్షన్లు వెనక్కి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 9: అమెరికాలోని తమ సబ్సిడిరీ కంపెనీకి సరఫరా చేసిన అనస్తేషియా ఇంజక్షన్లకు సంబంధించిన 13,918 కార్టన్లను సన్‌ఫార్మాస్యూటికల్ స్వచ్ఛందంగా వెనక్కి రప్పిస్తోంది. తాము సరఫరా చేసిన వెక్యురోనియమ్ బ్రొమైడ్ 10 ఎంజీ, 20 ఎంజీ ఇంజక్షన్లలోని కణరూప ద్రవ్యంలో గాజు అవశేషాలను గుర్తించినందున వాటిని స్వచ్ఛందంగా వెనక్కి రప్పిస్తున్నట్టు కంపెనీ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు అమెరికాలోని తమ సబ్సిడిరీ కంపెనీ ఎస్‌పిఐఐకు మూడు లాట్ల ఇంజక్షన్లకు వాడే వెక్యురోనియమ్ బ్రొమైడ్, 10 ఎంజీ లియోఫిలైజ్‌డ్ పౌడర్, ఒక లాటు 20 ఎంజీ లియోఫిలైజ్‌డ్ పౌడర్‌ను ఆసుపత్రి స్థాయి నుంచి వెనక్కి రప్పిస్తున్నట్టు తెలిపారు. ఈ విషయాన్ని అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్‌కు మంగళవారం లెటర్ ద్వారా తెలియజేసామన్నారు. ఈ ఉత్పత్తులను ఇప్పటికే ఆ దేశంలోని హోల్‌సేల్ కస్టమర్స్, వైద్య సంస్థలకు సరఫరా చేసామని, వాటిని వెంటనే వెనక్కి రప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. అయితే తాము పంపిన ఈ ఉత్పత్తులకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదని, ముందు జాగ్రత్త చర్యగా స్వచ్ఛందంగా వాటిని వెనక్కి రప్పిస్తున్నట్టు సన్ ఫార్మాస్యూటికల్ తెలియజేసింది.