బిజినెస్

పుంజుకున్న మార్కెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జనవరి 9: భారత స్టాక్ మార్కెట్ బుధవారం మరింత పుంజుకుంది. లాభాలను కొనసాగిస్తూ వచ్చిన సెనె్సక్స్ మరోసారి 36,000 పాయింట్లను అధిగమించింది. లావాదేవీలు మొదలైనప్పటి నుంచి సానుకూల ధోరణులు కనిపించడంతో, మదుపరులు కూడా స్టాక్స్ కొనుగోళ్లకు ఆసక్తిని ప్రదర్శించారు. మధ్యలో కొన్ని ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ, మొత్తం మీద ట్రేడింగ్ ఆశాజనకంగానే కొనసాగింది. చివరికి 231.98 పాయింట్లు పెరిగిన సెనె్సక్స్ 36,181.37 పాయింట్ల వద్ద ముగిసింది. ఒకానొక దశలో ఇది అత్యధికంగా 36,250.54 పాయింట్లకు చేరినప్పటికీ, ఆతర్వాత తగ్గుదల నమోదైంది. సస్సెక్స్‌తోపాటు నిఫ్టీ కూడా పెరిగింది. 53 పాయింట్లు లాభపడడంతో నిఫ్టీ 10,855.15 పాయింట్లుగా నమోదైంది. ఎక్కువ సేపు లావాదేవీల్లో నిఫ్టీ 10,870.40-10,749.40 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. చివరికి అటు అత్యధికంగానీ, ఇటు అత్యల్పంగానీ కాకుండా, మధ్యస్తంగా ముగిసింది. బాంబే స్టాక్ మార్కెట్ (బీఎస్‌ఈ)లో బుధవారం యాక్సిస్ బ్యాంక్, ఐటీసీ, టాటా మోటార్స్, భారతీ ఎయిర్‌టెల్, హెచ్‌డీఎఫ్‌సీ, ఇండస్‌ఇండ్ బ్యాంక్, హెచ్‌యూఎల్, ఇన్ఫోసిస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, మారుతి, ఐసీఐసీ బ్యాంక్ లాభపడ్డాయి. వీటి షేర్లు సుమారుగా 2.94 శాతం పెరగడం విశేషం. కాగా, ఎస్ బ్యాంక్, టాటా స్టీల్, హీరో మోటోకార్ప్, ఓఎన్‌జీసీ, బజాజ్ ఫైనాన్స్, ఎన్‌పీటీసీ, హెచ్‌సీఎల్ టెక్, టీసీఎస్ కంపెనీల షేర్లు నష్టాలు చవిచూశాయి. వీటి పతనం సగటున 3.07 శాతంగా నమోదైంది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధిరేటు 7.3 శాతంగా ఉంటుందని, ఆ తర్వాత రాబోయే రెండేళ్ల కాలంలో అది కనీసం 7.5 శాతంగా ఉంటుందని ప్రపంచ బ్యాంక్ అంచనా వేయడంతో స్టాక్ మార్కెట్‌లో సానుకూల సూచీలు కనిపించాయి. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటని ప్రపంచ బ్యాంక్ తన నివేదికలో స్పష్టం చేసింది. మరోవైపు అమెరికా, చైనా మధ్య నెలకొన్న వాణిజ్య యుద్ధానికి అతి త్వరలో తెరపడుతుందనే వార్త బలంగా వినిపిస్తున్నది. ఈ రెండు అంశాలు ప్రపంచ మార్కెట్‌ను ప్రభావితం చేసింది. అదే విధంగా బీఎస్‌ఈలోనూ సానుకూల ధోరణులకు కారణమైంది. ఇలావుంటే, డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసిక ఫలితాలను కంపెనీలు వెల్లడించడం మొదలుపెట్టాయి. స్టాక్ మార్కెట్‌పై త్రైమాసిక ఫలితాల ప్రభావం తీవ్రంగా ఉంటుందనేది వాస్తవం. మొత్తం మీద బుధవారం నాటి మార్కెట్ ఆనుకూల ధోరణుల్లో కొనసాగింది. దేశీయ సంస్థాగత పెట్టుబడిదారు 698.17 కోట్ల రూపాయల విలువైన షేర్లను కొనుగోలు చేయగా విదేశీ మదుపరులు అమ్మిన వాటాల విలువ 553.78 కోట్ల రూపాయలుగా నమోదైంది.