బిజినెస్

ముద్ర స్కీంతో ప్రయోజనాలెన్నో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: కేంద్రప్రభుత్వం పరిశ్రమల అభివృద్ధికి చేపట్టిన ముద్ర స్కీం వల్ల మహిళలు మంచి లబ్ధి పొందుతున్నారని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అన్నారు. మహిళా సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. సంఘటిత రంగంలో పరిశ్రమల ఏర్పాటుకు ఉన్న అవకాశాలను ఉపయోగించుకునేందుకు మహిళలు ముందుకు రావాలని ఆమె పిలుపునిచ్చారు. చిన్న పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రధానమంత్రి ముద్ర యోజన కింద రూ. 10 లక్షల వరకు రుణాలు ఇస్తున్నామని చెప్పారు. ఈ రుణాలను బ్యాంకులు, ఆర్థిక ఏజన్సీలు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు ఇస్తున్నాయన్నారు. పరిశ్రమలు స్ధాపించాలన్న ఉత్సాహం ఉన్న ప్రతి ఒక్కరు ఈ స్కీంలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇంతవరకు ఈ స్కీం కింద 14 కోట్ల మందికి రుణాలు ఇచ్చామన్నారు. ఇందులో 75 శాతం మంది మహిళలే ఉండడం విశేషమన్నారు. బుధవారం ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ జౌళి పరిశ్రమ రంగంలో 75 శాతం మంది మహిళలే కార్మిక రంగంలో ఉన్నారని చెప్పారు. బాలికల విద్యాభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కోరారు. మహిళల్లో నైపుణ్యం పెంచేందుకు ప్రణాళికలు అమలు చేస్తున్నామన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉందని, రాజకీయ పార్టీలు ఈ బిల్లును ఆమోదించేందుకు ముందుకు రావాలన్నారు. ప్రభుత్వం ఈ బిల్లును ఆమోదించేందుకు సిద్ధంగా ఉన్నా, విపక్షాలు కలిసి రావడం లేదన్నారు.