బిజినెస్

బ్రాండ్ మార్కెటింగ్‌లో అగ్రగామిగా ‘ఇన్‌స్టాగ్రామ్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జనవరి 10: బ్రాండ్ మార్కెటింగ్ ప్రచార వేధికల్లో ప్రఖ్యాత సామాజిక మాధ్యమ యాప్ ఇన్‌స్టాగ్రామ్ అగ్రభాగాన్ని ఆక్రమించింది. మార్కెట్‌ను ప్రభావితం చేసే స్థాయికి చేరిందని తాజా అధ్యయన నివేదిక వెల్లడించింది. ఫేస్‌బుక్ ఫొటో, వీడియో షేరింగ్ సామాజిక మాధ్యమ సేవా విభాగంగా ఉన్న ఈ ఇన్‌స్టాగ్రాంలో 77 శాతం బ్రాండెడ్ వస్తువులు నమోదై ఉన్నాయి. ఫేస్‌బుక్‌లో 54 శాతం నమొదై ఉందని మార్కెటింగ్ సంస్థ బజ్జోకా నివేదిక వెల్లడించింది. మొత్తం 500 బ్రాండ్లు, కంటెంట్ క్రియేటర్ల సాయంతో ఈ సర్వేను నిర్వహించడం జరిగింది. 69 శాతం బ్రాండ్లు మార్కెట్‌ను ప్రభావితం చేసేలా ప్రచారం నిర్వహించేందుకు సంబంధిత కంపెనీలు సుమారు 50 వేల కోట్ల రూపాయలు ప్రతియేటా ఖర్చు చేస్తున్నాయని, మరో 27 శాతం బ్రాండ్లు లక్ష డాలర్ల వరకు ఖర్చు చేస్తున్నాయని నివేదిక వెల్లడించింది. ప్రభావితం చేసే మార్కెట్ల ద్వారా ప్రచారం చేస్తే మంచి ఫలితాలుంటాయని సుమారు 88 శాతం బ్రాండెట్ కంపెనీలు నమ్ముతున్నట్టు తేలింది. ప్రధానంగా ప్రచార కంటెంట్ నాణ్యత బాగుండాలని 33 శాతం బ్రాండెడ్ కంపెనీలు ఆశిస్తున్నాయి. యూట్యూబ్ వేధికగా సైతం ప్రభావిత మార్కెటింగ్ ప్రచారం అధికంగా జరుగుతున్నట్టు, వీడియోలు అధిక సంఖ్యాకులు వీక్షిస్తున్నట్టు నివేదిక వెల్లడించింది. 2019లో మార్కెటింగ్ ఎకోసిస్టంలో సామాన్య ప్రజల పాత్ర అధికంగా ఉంటుందని నివేదిక అంచనావేసింది. కాగా ప్రభావిత మార్కెటింగ్ (ఇన్ల్ఫూయెన్సర్ మార్కెటింగ్)లో ప్రస్తుతం ఇన్‌స్టాగ్రాం, లింకేడిన్, టిక్‌టాక్ అగ్రభాగాన్ని ఆక్రమించాయి.