బిజినెస్

అనుకోని పతనం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జనవరి 10: బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ)లో వరుసగా నాలుగు రోజులు లాభాలను ఆర్జించిపెట్టిన లావాదేవీలు గురువారం నీరసించాయి. బుల్ రన్ కొనసాగుతుందని అంతా ఊహించగా, అందుకు భిన్నంగా అమ్మకాలు, కొనుగోళ్ల మధ్య ఊగిసలాడింది. చివరికి 106.41 పాయింట్లు (0.29 శాతం) నష్టపోయి 36,106.50 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 33.55 పాయింట్లు (0.31 శాతం) పతనమై, 10,821.60 పాయింట్లుగా నమోదైంది. స్టాక్ మార్కెట్‌ను ఆదుకుంటూ వచ్చిన బ్యాంకింగ్ రంగ వాటాలు గురువారం అనూహ్యంగా పతనమయ్యాయి. ఇండస్‌ఇండ్, కోటక్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎస్‌బీఐ సగటున 2.36 శాతం నష్టపోయాయి. మిగతా రంగాల విషయానికి వస్తే, ఓఎన్‌జీసీ, మారుతీ సుజుకీ, సన్ ఫార్మా, హెడ్‌డీఎఫ్‌సీ, హీరో మోటోకార్ప్, ఐటీసీ, హెచ్‌సీఎల్ టెక్ కంపెనీల షేర్లు సగటున 1.31 శాతం కోల్పోయాయి. టీసీఎస్ 0.25 శాతం నష్టపోగా, ఈ ఆర్థిక సంవత్సరం చివరి, నాలుగో మాసంతం మొదట్లోనే 1,883 రూపాయల మేర నష్టాన్ని ఎదుర్కోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. కాగా, గురువారం నాటి ట్రేడింగ్‌లో లాభాలను ఆర్జించిన కంపెనీల్లో టాటా మోటార్స్, ఎన్‌టీపీసీ, ఇన్ఫోసిస్, ఎస్ బ్యాంక్, మహీంద్ర అండ్ మహీంద్ర, ఎల్ అండ్ టీ, భారతీ ఎయిర్‌టెల్, హెచ్‌యూఎల్ ఉన్నాయి. వీటి వాటాల కొనుగోళ్లు పెరిగడంతో, స్టాక్ మార్కెట్ పతనానికి కొంత వరకైనా బ్రేక్ పడింది. విదేశీ పోర్ట్ఫోలియో మదుపరులు (ఎఫ్‌పీఐ) 276.14 కోట్ల రూపాయల విలువైన స్టాక్స్‌ను కొనుగోలు చేస్తే, దేశీయ పెట్టుబడిదారులు కొన్న వాటాల విలువ 439.67 కోట్ల రూపాయలు. అయితే, అంతర్జాతీయ మార్కెట్‌లో నెలకొన్న అనిశ్చితి తీవ్ర ప్రభావం చూపిన నేపథ్యంలో, భారత స్టాట్ మార్కెట్ కూడా ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నది. లాభాలు తప్పవని భావించినప్పుడు నష్టాలు రావడం ప్రస్తుత పరిస్థితుల్లో నెలకొన్న అనిశ్చితికి అద్దం పడుతుంది.