బిజినెస్

ఎనిమిది శాతం పెరిగిన ఉద్యోగ నియామకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జనవరి 10: గత డిసెంబర్ మాసంలో మనదేశంలో ఉద్యోగ నియామకాల శాతం పెరిగింది. అంతకు క్రితం సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే ఈ నియామకాలు 8 శాతం అధికంగా జరిగాయి. ప్రధానంగా మోటారు వాహనాలు, సహకార రంగాలతోబాటు మానవ వనరుల విభాగాల్లో ఈ నియామకాలు అధికంగా జరిగాయని నౌకరీ వెబ్‌సైట్ అధ్యయన నివేదిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దేశంలో జరిగిన మొత్తం ఉద్యోగ నియామకాల్లో 24 శాతం మోటారు వాహనాలు, సహకార రంగాల్లో జరిగాయని, ఇవి రికార్డు స్థాయి అధిక నియామకాలని నివేదిక స్పష్టం చేసింది. అలాగే మానవ వనరుల విభాగాల్లో నియామకాలు సైతం 17 శాతం పెరిగాయి. కాగా ఐటీ-సాఫ్ట్‌వేర్ రంగాల్లో సైతం ఈ నెలలో 17 శాతం అధికంగా నియామకాలు జరిగాయి. కాగా మెట్రోపాలిటన్ నగరాల్లో నియామక సెంటిమెంట్ సానుకూలంగానే ఉందని, బెంగళూరులో 13 శాతం, ఢిల్లీల్లో 10 శాతం అధికంగా డిసెంబర్‌లో నియామకాలు జరిగాయని నివేదిక వెల్లడించింది. పెద్ద నగరాలు, పారిశ్రామిక ప్రాంతాల్లో ఉద్యోగ నియామకాల్లోనూ 2018లో వృద్ధి కనిపించింది. గత కొన్ని నెలల నుంచి మోటారు వాహనాలు, సంబంధిత సహకార రంగాల్లో నియామకాలు జోరు సాగుతోందని నివేదిక వివరించింది. ముఖ్యంగా వాణిజ్య రంగాల్లో ఔట్ సోర్సింగ్ (బీపీఓ) ద్వారా నియామకాలకు గడచిన యేడాది ప్రోత్సాహక సంవత్సరం, అలాగే శీఘ్రంగా అమ్ముడయ్యే వినిమయ వస్తువుల తయారీ (ఎఫ్‌ఎంసీజీ) రంగంలో సైతం నియామకాలు బాగా చోటుచేసుకున్నాయని నివేదిక వెల్లడించింది. కొత్త యేడాదిలోనూ ఈ ట్రెండ్ కొనసాగవచ్చని ఇన్ఫోఎడ్జ్ ఇండియా సీఎంవో సుమీత్ సింగ్ ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా చెన్నై నగరంలో గడచిన యేడాది 9 శాతం అధికంగా నియామకాలు జరిగాయి. ఇందుకు కారణం అక్కడ 22 శాతం అధికంగా పారిశ్రామికాభివృద్ధి చోటుచేసుకోవడమే. అలాగే పూనేలో 15 శాతం అదనపు నియామకాలు జరిగాయని, ఐటీ పరిశ్రమలో 20 శాతం అధికంగా ఉద్యోగ నియామకాలు జరిగాయని నౌకరీ నివేదిక పేర్కొంది. ఇలావుండగా మూడేళ్ల అనుభవ ప్రాధాన్యతతో ఉద్యోగాల్లో నియమించడం సైతం 9 శాతం పెరిగింది. అలాగే 8 నుంచి 12 సంవత్సరాల అనుభవం గల వారిని మిడిల్ మేనేజ్‌మెంట్ రోల్స్‌లో నియమించుకోవడం 7శాతం, సీనియర్ మేనేజ్‌మెంట్ రోల్స్‌లో 13 నుంచి 16 సంవత్సరాల అనువజ్ఞులను నియమించుకోవడం 5శాతం పెరిగాయి. అయితే 16 సంవత్సరాల అనుభవజ్ఞులను నాయకత్వ స్థానాల్లో నియమించుకోవడంలో మాత్రం గడచిన యేడాది పెద్దగా పురోగతి లేదని నివేదిక స్పష్టం చేసింది.