బిజినెస్

యస్ బ్యాంక్ నాన్ ఎగ్జిక్యూటివ్ పార్ట్‌టైం చైర్మన్‌గా బ్రహ్మదత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 12: దేశంలో నాల్గవ అతి పెద్ద ప్రైవేట్ బ్యాంక్ యస్ బ్యాంక్ నాన్ ఎగ్జిక్యూటివ్ పార్ట్‌టైం చైర్మన్‌గా బ్రహ్మ దత్ నియమితులయ్యారు. ఈ మేరకు బ్రహ్మదత్ నియామకాన్ని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖరారు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఆయన ఈ పదవిలో 2020 జూలై 4వ తేదీ వరకు ఉంటారు. బ్రహ్మదత్ 2013 జూలై నుంచి యస్ బ్యాంక్ బోర్డులో ఉంటున్నారు. గత ఐదున్నరేళ్లుగా అన్ని సబ్ కమిటీల్లో ఆయన పనిచేశారు. ఐఎఎస్ అధికారిగా పనిచేసిన బ్రహ్మదత్ గతంలో కర్నాటక ప్రభుత్వం, కేంద్ర సర్వీసుల్లో వివిధ హోదాల్లో పనిచేశారు. ఉపరితల రవాణా శాఖ కేంద్ర మంత్రిత్వ విభాగం కార్యదర్శిగా పనిచేవారు. ఈ బ్యాంకు బోర్డులో ముఖేష్ సబర్వాల్, సుభాష్ కాలియా, అజయ్ కుమార్, ప్రాతిమాషేరాయ్, ఉత్తమ్ ప్రకాశ్ అగర్వాల్, టీఎస్ విజయన్, రాణా కపూర్ ఉన్నారు. కాగా ఈ బ్యాంకు ఎంపీ, సీఈవోగా రజత్ మాంగాను నియమించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.