బిజినెస్

త్వరలో కొత్త పారిశ్రామిక విధానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జనవరి 12: త్వరలో కొత్త పారిశ్రామిక విధానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి సురేష్ ప్రభు ప్రకటించారు. అంతర్జాతీయ పారిశ్రామిక, వాణిజ్య రంగంతో అనుసంధానానికి వీలుగా కొత్త పారిశ్రామికవిధానం ఉంటుందన్నారు. ప్రపంచంలోని అన్ని దేశాలతో వాణిజ్య లావాదేవీలు చేసేందుకు వీలుగా ప్రణాళికను ఖరారు చేస్తామన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం పెరగడం, ప్రపంచ వాణిజ్య సంస్థ కార్యకలాపాలను అమెరికా ప్రశ్నించడం, అనేకదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న వస్తువులపై సుంకాలను అమెరికా పెంచిన నేపథ్యంలో కేంద్రం చేసిన ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. కేంద్రమంత్రివర్గం ఆమోదం లభించిన వెంటనే కొత్త పారిశ్రామికవిధానం అమలవుతుందన్నారు. పరిశ్రమల ఉత్పత్తులు, మార్కెటింగ్, ఇతర దేశాలతో అనుసంధానానికి ప్రాధాన్యత ఇస్తామన్నారు. దళారుల పాత్రను అరికట్టనున్నట్లు చెప్పారు. సీఐఐ ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన మాట్లాడుతూ 2035 నాటికి భారత దేశ ఆర్థిక వ్యవస్థ 10 ట్రిలియన్లకు చేరుకునేవిధంగా ప్రణాళికలను ఖరారు చేస్తామన్నారు. ఈ రోజుల్లో ఏ దేశమైనా ఇతర దేశాలతో సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యమన్నారు. సేవా రంగంలో అద్భుతమైన ప్రగతిని సాధించేందుకు అవకాశం ఉందన్నారు. 12 రంగాల వల్ల ఆర్థికాభివృద్ధి సాధ్యమని గుర్తించినట్లు చెప్పారు. నాణ్యమైన వస్తువుల ఉత్పత్తి వల్ల మార్కెట్ బాగుంటుందన్నారు.ప్రతి జిల్లాలో పరిశ్రమల రంగం అభివృద్ధి చెందే విధంగా ప్రణాళికను ఖరారు చ్తేమన్నారు. రానున్నరోజుల్లో ఆర్థికాభివృద్ధి రెండు అంకెలకు చేరుతుందన్నారు. కిందిస్థాయి నుంచి అభివృద్ధిజరిగినప్పుడే లక్ష్యాలను సాధించగలమన్నారు. విదేశీ పెట్టుబడులు పెరిగాయన్నారు.