బిజినెస్

ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై బ్రెగ్జిట్ ప్రభావం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్: యూరోపియన్ యూనియన్ (ఈయూ)తో ఆర్థిక పరమైన ఒప్పందాలను రద్దు చేసుకొని, విడిపోవాలన్న యునైటెడ్ కింగ్డమ్ (యూకే) ప్రయత్నం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం కనిపిస్తున్నది. ‘బ్రెగ్జిట్’గా అందరికీ తెలిసిన ఈ వ్యవహారం చాలాకాలంగా నానుతున్నది. అయితే, ఇటీవల ప్రజాభిప్రాయ సేకరణ జరగడంతో, వాటి ఫలితాలు ఎలా ఉంటాయన్నది ఆసక్తిని రేపుతున్నది. ఓటింగ్ పూర్తయినప్పటికీ, ఇంగ్లాండ్ ప్రధాని థెరెసా మేకు ప్రజలు అనుకూలంగా తీర్పునిచ్చారా? లేక ఆమె ప్రతిపాదనను తిరస్కరించారా? అనే విషయంపై స్పష్టత రావడానికి మరికొంత సమయం పడుతుంది. ఈలోగా, బెట్టింగ్ జోరు పెరిగింది. బ్రెగ్జిట్ ఫలితం, ప్రభావాలపై పందాలకు పంటర్లు శ్రీకారం చుట్టారు. ఇలావుంటే, బ్రెగ్జిట్ కారణంగా యూరోపియన్ యూనియన్, యునైటెడ్ కింగ్డమ్‌లో ఉన్న కరెన్సీ విలువలో వ్యత్యాసం ప్రపంచ ఆర్థిక రంగాన్ని ప్రభావితం చేస్తుందని అంటున్నారు. పౌండ్ విలువ యూరోపియన్ యూనియన్‌లో ప్రస్తుతం ఒకే విధంగా ఉంది. అయితే, బ్రెగ్జిట్ తర్వాత యునైటెడ్ కింగ్డన్ ఆర్థిక పరమైన అంశాల నుంచి పూర్తిగా వైదొలిగితే, కరెన్సీ విలువలో మార్పు తప్పదు. ఇదే అంశం పంటర్లకు కాసుల పంట పండిస్తున్నది. కాగా, కేంబ్రిడ్జి యూనివర్శిటీకి చెందిన ఆర్థిక వేత్తలు జరిపిన అధ్యయనంలో భారీ మార్పులు తప్పవన్న అభిప్రాయం వ్యక్తమైంది. స్టెర్లింగ్‌తో డాలర్ మార్పిడి రేటులో విపరీతమైన తేడా తలెత్తుతుందని అంటున్నారు. వాస్తవానికి ఒకదానితో కలిసి ఒకటి కలిసికట్టుగా పని చేస్తున్నందువల్లే యూరోపియన్ యూనియన్, యునైటెడ్ కింగ్డన్ ఆర్థిక వ్యవస్థలు క్రమంగా అభివృద్ధి పథంలో నడుస్తున్నాయి. రెండూ విడిపోతే, ఆర్థిక అసమానతలు పెరగడం ఖాయమని నిపుణుల అభిప్రాయం. అదే విధంగా విదేశీ పెట్టుబడుల్లో కోత తప్పదన్న వాదన కూడా బలంగా వినిపిస్తున్నది. రెండు మార్కెట్లు స్వయం సమృద్ధంగా లేవు. అదే విధంగా పరస్పర సహకారం తప్పనిసరి. కానీ, బ్రెగ్జిట్‌తో యూరోపియన్ యూనియన్‌తో ఏకీకృత ఆర్థిక వ్యవస్థ నుంచి యునైటెడ్ కింగ్డన్ వైదొలగాలని తీర్మానించింది. రాజకీయంగా పెను దుమారం రేపుతున్నప్పటికీ, రాబోయే ఎన్నికల్లో తాను నేతృత్వం వహిస్తున్న కన్జర్వేటివ్ పార్టీ నామ రూపాల్లేకుండా తుక్కుతుక్కుగా ఓడుతుందని వార్తలు వస్తున్నప్పటికీ థెరెసా మే ఏమాత్రం వెనుకంజ వేయడం లేదు. బ్రెగ్జిట్‌కే అమె మొగ్గుచూపుతున్నది. ఫలితంగా సొంత పార్టీలోనే అసమ్మతి సెగ ఆమెకు తప్పడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో, ప్రభుత్వం సమర్థంగా పని చేస్తుందని అనుకోవడానికి వీల్లేదు. ఈ కారణంగానే రాబోయే పరిణామాలపై పందాలు జోరుగా సాగుతున్నాయి. మొత్తం మీద బ్రెగ్జిట్‌పై ప్రజాభిప్రాయ సేకరణ ఫలితాలు వెల్లడయ్యే సమయం సమీపిస్తున్నకొద్దీ, ప్రపంచ దేశాల్లో ఆసక్తి కనిపిస్తున్నది. స్టాక్ మార్కెట్లపై దీని ప్రభావం ఉంటుందనేది వాస్తవం. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నులు రాబోయే కాలంలో ఏ విధంగా ఉండబోతుందనేది కూడా బ్రెగ్జిట్ ఫలితాలు స్పష్టం చేయనున్నాయి.