బిజినెస్

కుదిరిన ఒప్పందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబై, జనవరి 14: ఎస్సెల్ ఫారెక్స్, వైజ్‌మాన్ ఫారెక్స్ సంస్థల్లో 57.35 మిలియన్ డాలర్ల పెట్టుబడులతో ఆ సంస్థల్లో సుస్థిర స్థానాన్ని ఆక్రమించడం ద్వారా ఆర్థిక సేవలను మరింత విస్తరించాలని ఎబిక్స్‌కాష్ సంస్థ సోమవారం నాడిక్కడ నిర్ణయించింది. ఈమేరకు భారత్‌కు చెందిన వైజ్‌మాన్ ఫారెక్స్ సంస్థతో ‘ఎబిక్స్‌క్యాష్ వరల్డ్ మనీ’ సంస్థ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఆ ప్రకారం వైజ్‌మాన్ ఫారెక్స్ సంస్థలోని 74.84 శాతం వాటాలను ఎబిక్స్‌క్యాష్ సొంతం చేసుకుంటుంది. వైజ్‌మాన్ ఫారెక్స్ 65.94 మిలియన్ డాలర్ల సంస్థాగత విలువ కలిగివుంది. అలాగే ఎస్సెల్ ఫారెక్స్‌లో సైతం వంద శాతం ఆస్తులను సొంతం చేసుకునేలా ఎబిక్స్‌క్యాష్ మరో ఒప్పందం కుదుర్చుకుంది. ఆ ఆస్తులు మొత్తం 8 మిలియన్ డాలర్లు ఉంటాయని సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. ఎబిక్స్‌క్యాష్ సంస్థ దేశంలోని 3,700 నగరాలు, 6000 జిల్లాల్లో విస్తరించిన ఆర్థిక సంస్థగా గుర్తింపు పొందిందింది. ప్రధానంగా అంతర్గత పరిస్థితులు, బ్యాంకు రుణాలు తదితర అంశాల ప్రాతిపదికగా వాటాల సేకరణ, నిధుల విడుదల ఉంటుందని ఎస్సెల్ ఫారెక్స్ సంస్థ తెలిపింది.