బిజినెస్

మొబైల్ బ్యాంకింగ్‌లో పెరిగిన లావాదేవీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 16: మొబైల్ బ్యాంకింగ్ ద్వారా లావాదేవీలు క్రమంగా పెరుగుతున్నాయి. 2017 నవంబర్‌తో పోలిస్తే, గత ఏడాది నవంబర్ నాటికి ఈ లావాదేవీల విలువ రెట్టింపయింది. 1,05,424 కోట్ల రూపాయల నుంచి 2,45,859 కోట్ల రూపాయలకు చేరింది. 2017 నవంబర్ కంటే డిసెంబర్‌లో కేవలం 33 కోట్ల రూపాయల పెరుగుదల నమోదైంది. అయితే, ఆతర్వాత క్రమంగా పెరుగుతూ వచ్చింది. 2018 జనవరిలో 1,12,421, ఫిబ్రవరిలో 1,13,660, మార్చిలో 1,41,503 కోట్ల రూపాయల విలువైన లావాదేవీలు మొబైల్ బ్యాంకింగ్ ద్వారా జరిగాయి. తాజా ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి నవంబర్ వరకూ అందుబాటులో ఉన్న గణాంకాలు కూడా పెరుగుదలను సూచిస్తున్నాయి. ఏప్రిల్‌లో 1,34,839, మేలో 1,77,447, జూన్‌లో 1,89,466, జూలైలో 2,09,186, ఆగస్టులో 2,06,505, సెప్టెంబర్‌లో 2,17,450, అక్టోబర్‌లో 2,47,097 కోట్ల రూపాయల విలువైన లావాదేవీలు జరిగాయి. నవంబర్‌లో కొంత తగ్గినప్పటికీ, 2,45,859 కోట్ల రూపాయలుగా మొబైల్ బ్యాంకింగ్ లావాదేవీల విలువ నమోదైంది.