బిజినెస్

కార్ల అమ్మకాల్లో మారుతీ సుజికీ టాప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 16: కార్ల అమ్మకాల్లో మారుతీ సుజికీ అగ్రస్థానాన్ని ఆక్రమించిది. డిసెంబర్‌లో మొత్తం 1,55,159 కార్లు అమ్ముడుకాగా, వాటిలో 83,729 కార్లు మారుతీ సుజికీవే కావడం విశేషం.
రెండో స్థానంలో ఉన్న హ్యుందయ్ మోటార్స్ 34,361 వాహనాలను అమ్మింది. హోండా కంపెనీ 10,159 కార్లతో మూడో స్థానంలో నిలిచింది. టాటా మోటర్స్ 8,082, రెనాల్ట్ 5,832, టయోటా కిర్ల్ 3,941, ఫోర్డ్ ఇండియా 2,907, వోక్స్‌వాగన్ 2,785, నిస్సాన్ మోటార్స్ 1,952, స్కొడా ఆటో ఇండియా 1,178, మహీంద్ర అండ్ మహీంద్ర 158, ఫియట్ ఇండియా 75 చొప్పున వాహనాలను అమ్మగలిగాయి. జెన్ మోటర్స్, మహీ ఎలక్ట్రిక్ కనీసం ఒక్క కారును కూడా అమ్మలేకపోవడం గమనార్హం. ఇలావుంటే, కార్ల ఉత్పత్తి డిసెంబర్‌లో 11.28 శాతం తగ్గింది. 2017 డిసెంబర్ మాసంలో 2,01,781 కార్లు ఉత్పత్తికాగా, గత ఏడాది 1,79,014 కార్లకు పడిపోయింది. అదే విధంగా ఎగుమతుల్లో 28.20 శాతం లోటు నమోదైంది. 2017 డిసెంబర్‌లో 58,366 కార్లను ఎగుమతి చేయగా, గత ఏడాది డిసెంబర్‌లో అది 41,322 కార్లకు పతనమైంది.