బిజినెస్

అక్రమ సంస్థల కట్టడికి పోర్టల్ ప్రారంభించిన ఆర్‌బిఐ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఆగస్టు 4: విలువలు, నీతి, నియమాలు లేని సంస్థల ద్వారా వచ్చే అక్రమ ధనానికి కళ్లెం వేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) గురువారం sachet. rbi.org.in అనే ఓ వెభ్‌సైట్‌ను ప్రారంభించింది. సదరు సంస్థల సమాచారం తెలిసినవారికి ఈ వెబ్‌సైట్ ఉపకారిగా ఉంటుందని ఆర్‌బిఐ గవర్నర్ రఘురామ్ రాజన్ అన్నారు. ఈ పోర్టల్‌లో ఫిర్యాదులు నమోదు చేసుకోవచ్చని, తద్వారా ఎవరూ తమ కష్టార్జితాన్ని పోగొట్టుకోకుండా నివారించినవారమవుతామని అన్నారు. నిజాయితీగల సంస్థల్లో మదుపు చేయడానికి కూడా ఈ పోర్టల్ దోహదపడగలదని అభిప్రాయపడ్డారు. రెగ్యులేటర్లు, ప్రభుత్వరంగ ఏజెన్సీల మధ్య సమన్వయాన్ని పెంచడానికీ ఈ వెబ్‌సైట్ కారణం అవుతుందని ఈ సందర్భంగా రాజన్ అన్నారు.
పసిడి కొనుగోళ్లపై కమిటీ
మరోవైపు బంగారాన్ని కొనేందుకు, దానిపై మదుపు చేసేందుకు భారతీయులు అధికంగా ఎందుకు ఆసక్తి కనబరుస్తున్నారన్న దానిపై అధ్యయనం చేసేందుకు ఓ కమిటీని ఆర్‌బిఐ ఏర్పాటు చేసింది. పసిడి కొనుగోళ్ల వెనుక ఉన్న కారణాలను ఈ కమిటీ తెలియజేయనుంది. ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో ఫైనాన్షియల్ ఎకనామిక్స్ ప్రొఫెసరైన తరణ్ రామదొరై నేతృత్వంలో ఈ కమిటీ ఏర్పాటైంది. ఇందులో పలు రెగ్యులేటరీల నుంచి సభ్యులు ప్రాతినిథ్యం వహిస్తారు.

చిత్రం.. పోర్టల్ ప్రారంభోత్సవంలో మాట్లాడుతున్న రాజన్