బిజినెస్

వాటాల తాకట్టుకు.. రూ.700 కోట్ల పెట్టుబడులకు జెట్ ఎయిర్‌వేస్ సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 17: తమ వాటా 25శాతానికి తగ్గకుండా నిబంధనలు ఏర్పాటుచేస్తే తమ కంపెనీ జెట్ ఎయిర్ వేస్‌లో రూ.700 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని ఆ విమానయాన సంస్థ చైర్మన్ నరేష్ గోయెల్ గురువారం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు తెలిపారు.ప్రస్తుతం జెట్ ఎయిర్ సంస్థ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన సంగతి తెలిసిందే. ఈ సంస్థ వ్యూహాత్మక వాటాదారు ఎతిహాడ్ ఈ సంస్థకు క్రమంగా నిధులిచ్చి ఆర్థికంగా బలపరిచేందుకు కఠినతర నిబంధనలను ముందుకు తెస్తోంది. జెట్ ఎయిర్ వేస్ నుంచి చైర్మన్ గోయెల్ సైతం వైదొలగాలన్నది ఎతిహాడ్ నిబంధనల్లో ఒకటి. ఈక్రమంలో ఎస్‌బీఐ చైర్మన్ రజనీష్ కుమార్‌కు జెట్ ఎయిర్ వేస్ చైర్మన్ గోయెల్ తాజాప్రదిపాదనలతో కూడిన లేఖ రాశారు. జెట్ ఎయిర్ వేస్‌కు రుణాలను అందజేసిన కన్సార్టియం ఆఫ్ ఇండియన్ బ్యాంక్స్‌లో ఎస్‌బీఐ నాయకత్వ బ్యాంకుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం తమ సంస్థ ద్రవ్య లోటును, బ్యాంకుల నుంచి రుణ గ్రౌండింగ్‌లో ఆలస్యాన్ని, పార్ట్‌నర్ ఎతిహాడ్ నిబంధనలను దృష్టిలో ఉంచుకుని తానీ లేఖ రాస్తున్నానని గోయెల్ ఎస్‌బీఐ చైర్మన్‌కు వివరించారు. తాను అన్ని ఆస్తులను తాకట్టుపెట్టేందుకు, 700 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నానని ఈ సందర్భంగా నరేష్‌కుమార్ గోయెల్ తెలిపారు. ఐతే తన వాటా 25 శాతం తగ్గకుండా ఉంచాలని ఆయన నిబంధన విధించారు. ‘ఇది సాధ్యం కాకపోతే తాను ఎలాంటి నిధులనూ పెట్టుబడిగా పెట్టలేన’ని ఆయన తేల్చి చెప్పారు. లేదా ఒక వేళ తన వాటాలను బలోపేతం చేసుకునేందుకు ప్రత్యేక అనుమతిని ఇస్తే తప్ప తన సంస్థకు తాను అదనంగా నిధులు సమకూర్చుకోలేని పరిస్థితి ఉందన్నారు. కాగా గత డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో జెట్ ఎయిర్ వేస్ సంస్థకు 5,79.33,665 షేర్లున్నాయి. ఇవి కంపెనీలో దాదాపు 51 శాతం వాటాను కలిగివున్నాయి. ఈ వైమానిక సంస్థ షేర్లు ప్రస్తుతం 3.54 శాతం తక్కువగా రూ.261.40 వంతున ట్రేడ్ అవుతున్నాయి. కాగా. వరుసగా రెండోరోజూ ఈ కంపెనీ షేర్ల పతనం కొనసాగింది. గురువారం సైతం 5 శాతం మేర షేర్లు తగ్గిపోయాయి.