బిజినెస్

ఏడు మిలియన్ డాలర్ల సమీకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 17: ఫిన్‌టెక్ స్టార్టప్ ఇన్‌స్టామోజో తన ప్రస్తుత పెట్టుబడిదారుల నుంచి ఏడు మిలియన్ డాలర్లు (రూ.50కోట్లు) సమీకరించినట్టు బుధవారం నాడిక్కడ తెలిపింది. ఎనీపే, కలారి, బీనెక్ట్స్‌తోబాటు ఏంజెల్ ఇనె్వస్టర్ రష్మీక్వాట్రా సంస్థలు ఈ పెట్టుబడులు పెట్టాయని సంస్ధ వివరిచింది. కాగా సిరీస్-బీ రౌండ్‌లో జపాన్‌కు చెందిన గునోసీ సంస్థ కూడా తమ సంస్థ పెట్టుబడిదారుల్లో ఒకటిగా మారి ప్రగతికి దోహదం చేస్తోందని అధికారులు వివరించారు. ఇలావుండగా ఈ కంపెనీ మొత్తం 10 మిలియన్ డాలర్ల పెట్టుబడులు ఇప్పటి వరకు సమీకరించిందని ఇన్‌స్టామోజో సీఈవో, సహ వ్యవస్థాపకుడు సంపద్ స్వెయిన్ తెలిపారు. కొత్తగా సమీకరించిన నిధులను కంపెనీకి చెందిన రాయితీలు ప్రోత్సాహకాలతోబాటు, మొబైల్ విభాగం విభాగం విస్తరణకు, ప్రజ్ఞాపాటవాల పెంపునకు వినియోగిస్తామని ఆయన చెప్పారు. భారత మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ ప్రైజెస్ (ఎంఎస్‌ఎంఈ) రంగంలో సరికొత్త విప్లవానికి తమ వంతు కృషి చేస్తామన్నారు. ఇటీవల లాజిస్టిక్ సర్వీసులోకి పెట్టుబడులు పెట్టడం ద్వారా వచ్చే ఆర్థిక సంవత్సరంలోపు కంపెనీ మూడు నుంచి ఐదు అంకెల అభివృద్ధిని సాధిస్తుందని విశ్వసిస్తున్నామన్నారు. 2012లో ఈ కంపెనీని ఆకాష్ గెహానీ, ఆదిత్యసేన్ గుప్తా, స్వెయిన్ ఏర్పాటు చేశారు. తొలిసారిగా ఈ కంపెనీ 2014లో తన తొలిరౌండ్ పెట్టుబడులను సమీకరించింది. తర్వాత జపాన్‌కు చెందిన ‘ఎనీపే’ సంస్థ సైతం సిరీస్ బీలో భాగస్వామిగా మారింది.