బిజినెస్

స్వల్పంగా పెరిగిన సెనె్సక్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: గత రెండు రోజుల మాదిరిగానే గురువారం కూడా ముంబయి స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ)లో లావాదేవీలు లాభనష్టాల మధ్య ఊగిసలాడాయి. అయితే, చివరికి 52.79 పాయింట్లు (0.15 శాతం) పెరిగిన సెనె్సక్స్ 36,374.08 పాయింట్ల వద్ద ముగిసింది. అదే విధంగా నిఫ్టీ 10,905.20 పాయింట్లు (0.14 శాతం) పెరగడంతో ట్రేడింగ్ ముగిసే సమయానికి 10,905.20 పాయింట్లుగా నమోదైంది. అంతర్జాతీయ మార్కెట్ సూచీలు సానుకూల ధోరణులను ప్రదర్శించడంతో భారత స్టాక్ మార్కెట్ స్వల్ప లాభాలతో ముగిసింది. అయితే, ట్రేడింగ్ మొదలైనప్పటి నుంచి చివరి వరకూ అనిశ్చితి కొనసాగింది. అమ్మకాల ఒత్తిడి కొంత సేపు పెరగడం, మరికొంత సేపు కొనుగోళ్ల తాకిడి ఏర్పడడంతో, సెనె్సక్స్ ఏ విధంగా ముస్తుందోనన్న అనుమానాలు తలెత్తాయి. కేంద్రం మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టడానికి ముందు స్టాక్ బ్రోకర్లు, మదుపరులు మార్కెట్‌ను నిశితంగా గమనిస్తూ, ట్రేడింగ్ చేశారు. డిసెంబర్‌తో ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం ముగిసిన నేపథ్యంలో, వివిధ భారీ కంపెనీల ప్రకటించబోయే ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. రూపాయి మారకపు విలువ బలోపేతం కాకపోవడంతో, ఐటీ కంపెనీల వాటాలకు డిమాండ్ తగ్గింది. రియల్ ఎస్టేట్ రంగం మాత్రం లాభాలను ఆర్జించింది. ఈ రంగం కొంతకాలంగా ఎదుర్కొన్న సమస్యలకు తెరపడిందని, ఇకపై రియాల్టీ రంగం భారీ లాభాలను ఆర్జిస్తుందని నిపుణులు అంటున్నారు. కాగా, ముడి చమురు ధర పెరుగుదల, రూపాయి మారకపు విలువ తగ్గడం వంటి అంశాలు కూడా స్టాక్ మార్కెట్‌ను ప్రభావితం చేశాయి.
అయితే, దేశీయ మదుపరులు కొంత వరకూ కొనుగోళ్లు చేయడంతో, నష్టాలను అధిగమించిన స్టాక్ మార్కెట్ స్వల్ప లాభంతో ముగిసింది. లాభపడిన కంపెనీల్లో యాక్సిస్ బ్యాంక్ (1.91 శాతం), హెచ్‌సీఎల్ టెక్ (1.77 శాతం), హెచ్‌డీఎఫ్‌సీ (1.51 శాతం), టీసీఎస్ (1.34 శాతం), కోటక్ మహీంద్ర (1.24 శాతం), మహీంద్ర అండ్ మహీంద్ర (1.19 శాతం), పవర్ గ్రిడ్ (1.09 శాతం), వేదాంత (0.54 శాతం), హెడ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 0.43 శాతం) లాభపడ్డాయి. వీటి లాభాలు సగటున 1.91 శాతంగా నమోదయ్యాయి. నష్టాలను ఎదుర్కొన్న కంపెనీల్లో సన్ ఫార్మా మొదటి స్థానంలో ఉంది. ఆ కంపెనీ వాటాలు ఏకంగా 5.78 శాతం పతనమయ్యాయి. ఎస్ బ్యాంక్, ఎస్‌బీఐ, బజాజ్ ఫైనాన్స్, టాటా స్టీల్, భారతీ ఎయిర్‌టెల్, ఓఎన్‌జీసీ కంపెనీల వాటాలు సగటున 3.31 శాతం నష్టాలను చవిచూశాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (రిల్), హెచ్‌యూఎల్ కూడా నష్టపోయినప్పటికీ, 1.12 శాతం పతనంతో కొంత వరకు ఊపిరి పీల్చుకున్నాయి.