బిజినెస్

ఉత్పత్తిని తగ్గించేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్యారిస్: పడిపోతున్న ముడి చమురు ధరలు మరింతగా పడిపోకుండా అదుపుచేసేందుకు ఉత్పత్తిని తగ్గించుకోవాలని తీర్మానించినట్టు సౌదీ అరేబియా వెల్లడించింది. ఒపెక్ దేశాల నూతన ఒప్పందం మేరకు చమురు ధరలను పెంచేందుకు తమవంతు యత్నంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించింది. పైగా రష్యా ఇప్పటికే రికార్డు స్థాయిలో ఉత్పత్తిని పెంచిందని, ఈ ప్రభావంతో మరింత ధరల తగ్గుదల ఏర్పడకుండా చూడాల్సిన ఆవశ్యకత ఏర్పడిందని సౌదీ వాఖ్యానించిందని అంతర్జాతీయ ఎనర్జీ ఏజెన్సీ నివేదిక తెలిపింది. కొన్ని నెలలుగా చమురు ధరల్లో విశేష తరుగుదల కనిపిస్తోంది. దీంతో అపెక్-ప్లస్‌గా పిలుచుకునే అపెక్ దాని అనుబంధ దేశాల్లో ఒకటైన రష్యా ఈ జనవరి నుంచి చమురు ఉత్పత్తులను తగ్గించుకునేందుకు అంగీకరించాయి. కారణం పడిపోయిన చమురు ధరలను అదుపుచేయాలన్న ఉద్దేశమేనని నివేదిక తెలిపింది. ‘కేవలం రెండు నెలల కాలంలోనే మూడో వంతు ధరల తరుగుదల ఏర్పడిందని, ఈక్రమంలో ఉత్పత్తిని తగ్గించుకోవాలన్నది కేవలం మాటలతో సరిపుచ్చడానికి వీల్లేద’ని సౌదీ అరేబియా వ్యాఖ్యానించింది. ఐతే ఇందుకు సంబంధించి పార్ట్‌నర్ రష్యా ఎలాంచి చర్యలు అమలు చేస్తుందన్నదానిలో స్పష్టత లేదని వివరించింది. గత నెలలో సౌదీతోబాటు ఒపెక్ సభ్య దేశాల చమురు ఉత్పత్తి సైతం అధిక స్థాయిలో జరిగినందువల్ల ఈ పరిణామం ధరల తరుగుదలపై మరింత దుష్టభ్రావం చూపిందని నివేదిక వెల్లడించింది. ప్రత్యేకించి రష్యా రోజుకు 11.5 మిలియన్ బ్యారెళ్ల వంతున గత డిసెంబర్ నెలలో ముడిచమురు ఉత్పత్తి చేసిందని నివేదిక గణాంకాలు తెలిపాయి. ప్రస్తుత జనవరి నుంచి రోజుకు 1.2 మిలియన్ బ్యారెళ్లకు ఉత్పత్తులను తగ్గించుకోవాలని గత డిసెంబర్‌లో ఒపెక్ సభ్య దేశాలు నిర్ణయించుకున్నాయి. ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు విధించడంతో అంతర్జాతీయ మార్కెట్లో విపరీతంగా పెరిగిన చమురు ధరలను అదుపుచేసేందుకు అప్పట్లో ఒపెక్ దేశాలు చమురు ఉత్పత్తిని పెంచాలని నిర్ణయించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగానే గత యేడాది అమెరికా ఉత్పత్తిలోనూ గణనీ పెరుగుదల నమోదైంది. చైనాతో ఆ దేశానికి ఏర్పడిన వాణిజ్య యుద్ధం సైతం ఇందుకు దోహదం చేసింది. ఐతే ఇప్పుడు అనూహ్యంగా మరీ అథమ స్థాయికి ధరలు పడిపోవడంతో ఆ దేశాలు మళ్లీ ప్రత్యామ్నాయ చర్యలవైపు అడుగువేస్తున్నాయి.