బిజినెస్

ఆరు మిడ్‌క్యాప్ కంపెనీలకు భారీ లాభాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 20: దేశ ఆర్థిక వ్యవస్థను శా సించే పది భారీ కంపెనీల్లో ఆరు కంపెనీలు గత వా రం భారీ లాభాలను ఆర్జించాయ. ఫలితంగా మా ర్కెట్‌లో వీడి విలువ 1,08,274.79 కోట్ల రూపాయ లకు పెరిగింది. వీటిలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమి టెడ్ (రిల్) అగ్రస్థానాన్ని ఆక్రమించింది. టాటా క న్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, ఇన్ఫోసిస్, కోటక్ మహీంద్ర బ్యాంక్ కంపెనీల మార్కెట్ విలువ భారీగా పెరిగింది. సో మ వారం నుంచి మొదలయ్యే కొత్త వారంలోనూ ఈ కంపెనీ వాటాల ర్యాలీ కొనసాగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మార్కెట్ విశే్లషకులు వ్యా ఖ్యానిస్తున్నారు. ఈ అతిపెద్ద కంపెనీల తీరుతెన్ను లను బట్టే భారత స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ ఆధార
పడి ఉంటుందన్నది వాస్తవం. ఇలావుంటే, గత వారం భారీగా నష్టపోయన హిందుస్థాన్ లీవర్ లిమిటెడ్ (హెచ్‌యూఎల్) ఐటీసీ, ఎస్‌బీఐ, ఐసీఐ సీఐ బ్యాంక్ కంపెనీలు ఈవారంలోనైనా కోలుకుం టాయా అన్నది అనుమానమే. గత వారం రిల్ మా ర్కెట్ విలువ 53,918.87 కోట్ల రూపాయలు పెరిగి, 7,49,829.58 కోట్ల రూపాయలకు చేరింది. దేశంలో ని టాప్ టెన్ కంపెనీల్లో మరే ఇతర సంస్థ కూడా ఇప్పటి వరకూ ఈ స్థాయలో మార్కెట్ విలువను పెంచుకోలేకపోయంది. రిల్ రికార్డు పరుగు వచ్చే వారం కూడా ఇదే తరహాలో కొనసా గుతుందన్న అభిప్రాయం మార్కెట్‌లో బలంగా వినిపిస్తున్నది. టీసీఎస్ మార్కెట్ విలువ 7,13,103.19 కోట్ల రూపాయలకు చేరుకోగా, ఇ న్ఫోసిస్ 20,663.70 కోట్ల రూపాయలు మెరుగుప డి 3,19,348.16 కోట్ల రూపాయలుగా నమోదైంది. అదే విధంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మార్కెట్ విలువ 5,180.65 కోట్ల రూపాయలు పెరింది. దీని విలువ ఇప్పుడు 5,79,580.13 కోట్ల రూపాయలు. హెచ్‌డీఎఫ్‌సీ విలువ 3,45,278.43 కోట్లు.