బిజినెస్

ఇక చాలు.. తప్పుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 20: బంగాళా ఖాతంలోని కేజీ-డీ 6 బ్లాక్‌లో భాగస్వామ్యం నుంచి వైదొలగాల్సిందిగా నికో రిసోర్సెస్‌కు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (రిల్) సూచించింది. గ్యాస్ క్షేత్ర అభివృద్ధికి పెట్టుబడులను ఇవ్వలేకపోతున్న నికో వల్ల ఉత్పత్తి ఆలస్యమవుతున్నదని రిల్ అభిప్రాయపడుతున్నది. అయితే, కెనడాకు చెందిన నికో సంస్థ మాత్రం రిల్‌తో భాగస్వామ్యాన్ని తెగతెంపులు చేసుకోవడానికి సంసిద్ధంగా లేదని, మధ్యవర్తి ద్వారా సమస్యను పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తున్నదని సమాచారం. తన రుణదాతలకు నికో కంపెనీ చెల్లింపులను చేయలేకపోతున్నది. కేజీ-డీ 6 క్లస్టర్‌లో తన 10 శాతం వాటాలను అమ్మడానికి సరైన పార్టీని సంపాదించలేకపోయింది. అదే విధంగా ఆర్-క్లస్టర్‌లోని తన వాటాకు సరిపడా ఫైనాన్స్‌ను కూడా పొందలేకపోయింది. ఫలితంగా అభివృద్ధికి కేటాయించిన మొత్తాల్లో, తన వంతు వాటాను ఇవ్వలేకపోతున్నది. రుణదాతలకు చెల్లింపుల్లో విఫలమవుతున్న కారణంగానే నికో సంస్థను భాగస్వామ్యం నుంచి వైదొలగాల్సిందిగా కోరుతున్నట్టు రిల్ ఒక ప్రకటనలో తెలిపింది. కాగా, వాటాను వదులుకోవడానికి సిద్ధంగా లేని నికో కంపెనీ ప్రతిఘటనకు సిద్ధమైంది. మధ్యవర్తి ద్వారా సెటిల్‌మెంట్‌కు ప్రాధాన్యం ఇస్తున్నది.