బిజినెస్

స్టాక్ మార్కెట్ స్థిరపడేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జనవరి 20: గత కొంతకాలంగా అనిశ్చితి పరిస్థితిని ఎదుర్కొన్న బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ)లో లావాదేవీలు కొత్త వారంలో స్థిరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (రిల్) ఇప్పటికే ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక ఫలితాలను వెల్లడించగా, ఇన్ఫోసిస్ 8,260 కోట్ల రూపాయల విలువైన 10.32 కోట్ల ఈక్విటీ షేర్లను తిరిగి కొంటున్నది. ఈ ‘బై బ్యాక్’ ద్వారా స్టాక్ మార్కెట్ లాభపడడం ఖాయం. ఇలావుంటే, అవరోధాలను అధిగమించి, రూపాయి మారకపు విలువ నిలదొక్కుకుంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. గత వారం లావాదేవీలు తీరుతెన్నులను పరిశీలిస్తే, భవిష్యత్తుపై కొంత స్పష్టత వస్తుందని అంటున్నారు. గత నెల 31వ తేదీన 36,068.33 పాయింట్లుగా ముగిసిన సెనె్సక్స్ మొదటి వారంలో కొంత పతనమై, చివరికి 35,695.10 పాయింట్లుగా నమోదైంది. రెండో వారంలోనూ అనిశ్చితి కొనసాగింది. అయితే, ఆటుపోట్ల మధ్య కొనసాగినప్పటికీ, సెనె్సక్స్ 36,009.84 పాయింట్లకు చేరింది. గత వారం లావాదేవీలు మొదలైన తొలి రోజునే మళ్లీ పతనమైన సెనె్సక్స్ 35,853.56 పాయింట్ల వద్ద ముగిసింది. కానీ, ఆతర్వాత వరుసగా నాలుగు రోజులు నష్టాల బారిన పడకుండా తప్పించుకోగలిగింది. మంగలశారం 36,318.33 పాయింట్లు, బుధవారం 36,321.29 పాయింట్లు, గురువారం 36,374.08 పాయింట్లు నమోదయ్యాయి. శుక్రవారం మరో 12.53 పాయింట్లు పెరిగి, 36,374.08 పాయింట్ల వద్ద తెరిపింది. గురు, శుక్రవారాల్లో లావాదేవీలు కనీసం సగటున మూడు వందల పాయింట్ల కనిష్ట, గరిష్ట స్థాయిల మధ్య ఊగిసలాడాయి. అంతర్జాతీయ పరిస్థితులుగానీ, వివిధ మార్కెట్ల సూచీలుగానీ పరిగణలోకి తీసుకుంటే, భారత స్టాక్ మార్కెట్ కూడా అదే స్థాయిలో నష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కానీ, దేశీయ మదుపరులు ఆదుకోవడంతో, సెనె్సక్స్ కుప్పకూలకుండా నిలబడగలిగింది. బుల్న్ కొనసాగకపోయినా, బేర్‌ది పైచేయి కాలేదు. కొత్త వారంలో స్టాక్ మార్కెట్ మరింతగా నిలదొక్కుకుంటుందన్న వాదనకు బలాన్ని చేకూరుస్తున్న అంశాలు చాలానే ఉన్నాయి. నిఫ్టీ కూడా లాభాలతో ముగియడం, కూడా స్టాక్ మార్కెట్ బలపడుతుందనడానికి ఒక కారణంగా చెప్పుకోవాలి.
జాగ్రత్తలు అవసరం
వచ్చే వారం స్టాక్ మార్కెట్ లాభసాటిగా ఉంటుందనే వాదన వినిపిస్తున్నప్పటికీ, అటు మదుపరులు, ఇటు బ్రోకర్లు అన్ని విధాలా జాగ్రత్తలు తీసుకోవడం అవసరమని మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రవేశపెట్టిన నిధుల ప్రతిపాదనలను చట్టసభ నిరాకరించడంతో, అమెరికా ఆర్థిక వ్యవస్థ పరిస్థితి అగమ్యగోచరంగా మారిన విషయం తెలిసిందే. ఈ ‘షట్‌డౌన్’ ఎంత కాలం కొనసాగుతుందో చెప్పడం కష్టం. అత్యవసర రంగాలకు నిధులను విడుదల చేయడానికి అంగీకరించిన పార్లమెంటు మిగతా ప్రతిపాదనలను పక్కకుపెట్టింది. మెక్సికో సరిహద్దులో భారీ గోడ నిర్మాణం కూడా చట్టసభ అంగీకరించని నిధుల ప్రతిపాదనల్లో ఒకటి. ఒకవేళ చర్చలు ఫలించి, ట్రంప్ సర్కారు చేసిన ప్రతిపాదనలు పూర్తిగా లేదా ఎక్కువ శాతం ఆమోద ముద్ర పొందితే, ‘షట్‌డౌన్’ నుంచి అమెరికా ఆర్థిక వ్యవస్థ బయటపడుతుంది. ఇలావుంటే, యూరోపియన్ యూనియన్‌తో ఆర్థిక లావాదేవీలకు గుడ్‌బై చెప్పాలన్న బ్రిటన్ ప్రధాని థెరెసా మే ప్రతిపాదనను అక్కడి పార్లమెంటు తిప్పికొట్టింది. బ్రిటన్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా, ఒక ప్రధాని ప్రవేశపెట్టిన తీర్మానం అత్యంత అవమానకర పరిస్థితుల్లో వీగిపోయింది. ‘బ్రెగ్జిట్’ ప్రభావం ప్రపంచ మార్కెట్‌పై ఉంటుందనేది వాస్తవం. భారత్ కూడా అందుకు మినసాయింపు కాదు. ఈ విషయాన్ని కూడా మదుపరులు జాగ్రత్తగా గమనించాలి. పరిణామాలను ఎప్పటికప్పుడు విశే్లషించుకోవాలి. అప్పుడే, మార్కెట్‌లో లాభసాటి ట్రేడింగ్ సాధ్యమవుతుంది. రూపాయి మారకపు విలువ, అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధర, దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న వివిధ కంపెనీల మూడో త్రైమాసిక ఫలితాలు, ఇన్ఫోసిస్ వంటి కంపెనీల ‘బై బ్యాక్’ వంటి అనేకానేక అంశాలు సైతం సోమవారం నుంచి ప్రారంభం కానున్న కొత్త వారం మార్కెట్ తీరుతెన్నులను నిర్ధారించనున్నాయి. అయితే, ఇవన్నీ సానుకూల ధోరణులనే ప్రదర్శిస్తాయని, కాబట్టి బీఎస్‌ఈ సూచీలు కూడా లాభాల్లో ఉంటాయని మార్కెట్ విశే్లషకులు జోస్యం చెప్తున్నారు. వీరి అంచనాలు నిజమవుతాయా? భారత స్టాక్ మార్కెట్ నిలదొక్కుకుంటుందా లేదా? అన్నది వేచి చూడాలి.