బిజినెస్

ఎల్ అండ్ టీ బై బ్యాక్ ప్రతిపాదనకు సెబీ ససేమిరా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 21: సుమారు 9,000 కోట్ల రూపాయల విలువైన ఈక్విటీ వాటాలను తిరిగి కొనేందుకు అంగీకరించాలంటూ ఎల్ అండ్ టీ చేసిన ప్రతిపాదనను భారత స్టాక్ మార్కెట్ నియంత్రణ బోర్డు ‘సెబీ’ తిరస్కరించింది.
ఇటీవల కాలంలో నష్టాలను ఎదుర్కొంటున్న ఈ కంపెనీ షేర్లు సోమవారం మరో మూడు శాతం పతనమయ్యాయి. కంపెనీ ఎదుర్కొంటున్న ఈ సమస్యను సెబీ తీసుకున్న నిర్ణయం మరింత తీవ్రతరం చేస్తున్నది. ఈ ప్రతిపాదన నిబంధనలకు విరుద్ధంగా ఉందని సెబీ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. బై బ్యాక్ తర్వాత సెక్యూర్డ్, అన్‌సెక్యూర్డ్ రుణాల దామాషా చెల్లించిన మూలధనానికి రెట్టింపు ఉండకూడదని తేల్చిచెప్పింది. అయితే ఎల్ అండ్ టీ సమర్పించిన ప్రతిపాదనను పరిశీలిస్తే, ఈ కంపెనీ నిబంధనల మేరకు దామాషాను పరిరక్షించడం లేదని స్పష్టమైందని సెబీ తన ప్రకటనలో వివరించింది. ఇలావుంటే, నిరాశాజనకంగా ప్రారంభమైన ఈ కంపెనీ షేర్ల ట్రేడింగ్ చివరి వరకూ డిమాండ్ లేకపోవడంతో మందగొడిగా సాగింది.
చివరికి 3.28 శాతం పతనమై 1,275 రూపాయలకు చేరింది. షేర్ మార్కెట్‌లో వాటాలు బలహీన పడినప్పుడు, కంపెనీ ప్రతిష్టను కాపాడుకోవడానికి బై బ్యాక్‌ను ఒక ఆయుధంగా ఉపయోగించుకుంటారు. పైగా, అదనంగా ప్రత్యేక డివిడెండ్లు ఇవ్వకుండానే మార్కెట్లో షేర్లను కొనుగోలు చేయవచ్చు. కానీ, సెబీ ససేమిరా అనడంతో ఎల్ అండ్ టీ ప్రత్యామ్నాయ ప్రయత్నాలు మొదలుపెట్టక తప్పదు.