బిజినెస్

పెరిగిన బంగారం ధర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 21: బులియన్ మార్కె ట్ సోమవారం సానుకూల ధోరణులతో కొనసాగింది. ఆభరణాల తయారీదారులతోపాటు సంస్థాగత పెట్టుబడిదారులు కూడా ఆసక్తిని ప్రదర్శించడంతో, జాతీయ మార్కెట్‌లో 10 గ్రాముల బంగారం ధర 40 రూపాయలు పెరిగి 33,200 రూపాయలకు చేరింది. ఉదయం 33,160 రూపాయల వద్ద మొదలైన బులియన్ మార్కెట్ ట్రేడింగ్ నింపాదిగా ముందుకు సాగింది. భారీ డిమాండ్లుగానీ, ఆకస్మిక వ్యతిరేక ధోరణులుగానీ లేకపోవడంతో, స్థిరమైన అమ్మకాలు కొనసాగాయి. ఈ స్వల్ప డిమాండ్ బంగారం ధర పెరగడానికి ఒకానొక కారణమైంది.