బిజినెస్

లాభాలతో మొదలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జనవరి 21: భారత స్టాక్ మార్కెట్ ఈవారం లాభాలతో మొదలైంది. దేశ ఆర్థిక వ్యవస్థను శాసించే స్థాయిలో ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (రిల్), ఇన్ఫోసిస్ వంటి భారీ కంపెనీలు ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక ఫలితాలను వెల్లడించడంతో, స్టాక్ మార్కెట్ పుంజుకుంది. గత వారం భారీగా లాభాలను నమోదు చేయలేకపోయినప్పటికీ, నష్టాల బారిన పడకుండా తప్పించుకొని, చివరి నాలుగు రోజులు స్వల్ప లాభాలను సంపాదించ స్టాక్ మార్కెట్ సోమవారం మరింత కుదుటపడింది. 192.35 పాయింట్లు (0.53 శాతం) లాభపడి, 36,578.96 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా లాభాల్లో నడించింది. 54.90 పాయింట్లు మెరుగుపడడంతో నిప్టీ 10,961.85 పాయింట్లకు చేరింది. కాగా, స్థూలంగా చూస్తే, గత నాలుగు రోజుల్లో సెనెక్స్ 533.05 పాయింట్లు పెరిగింది. అమెరికా, చైనా దేశాల మధ్య నెలకొన్న వాణిజ్య యుద్ధం త్వరలోనే ముగుస్తుందని, ఇరు దేశాల మధ్య ఒకటిరెండు రోజుల్లో ఒప్పందం కుదరనుందని వచ్చిన వార్తలు మార్కెట్‌లో సానుకూల వాతావరణాన్ని సృష్టించాయి. అంతర్జాతీయ సూచీలు బలపడడంతో, దేశంలోనూ ట్రేడింగ్ ఆశాజనకంగా కొనసాగింది. ఐటీ, టెక్నాలజీ, చమురు, గ్యాస్, ఫార్మా, బ్యాంకింగ్ వాటాలు లాభాల ర్యాలీని కొనసాగించాయి. రిలయన్స్, ఇన్ఫోసిస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తదితర సంస్థలు భారీ లాభాలతో మూడో త్రైమాసిక ఫలితాలను వెల్లడించడంతో మార్కెట్ సెంటిమెంట్ ట్రేడింగ్‌కు అనుకూలంగా మారింది. రిల్ వాటాలు ఏకంగా 4.36 శాతం మెరుగుపడ్డాయి. మూడో త్రైమాసికంలో 10,000 కోట్లకుపైగా లాభాలను ఆర్జించినట్టు తెలియడంతో, మదుపరులు ఈ కంపెనీ షేర్లు కొనడానికి ఆసక్తి ప్రదర్శించారు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వాటాల ధర 0.72 శాతం పెరిగింది. మొత్తం మీద అంతర్జాతీయ మార్కెట్లు క్రమంగా స్థిరపడడం బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ)లో ట్రేడింగ్‌కు ఊతమిచ్చింది.
వరుసగా నష్టాలను చవిచూస్తూ వస్తున్న సన్ ఫర్మా ఈవారం మొదటి రోజే లాభాల బాట పట్టడం గమనార్హం. ఈ కంపెనీ షేర్లు 1.94 వాతం లాభాలను నమోదు చేశాయి. కాగా, సోమవారం నాటి ట్రేడింగ్‌లో లాభపడిన కంపెనీల్లో కోటక్ బ్యాంక్ (2.42 శాతం), బజాజ్ ఫైనాన్స్ (1.89 శాతం), ఇన్ఫోసిస్ (1.61 శాతం), ఏషియన్ పెయింట్స్ (1.33 శాతం), టీసీఎస్ (0.28 శాతం), హెచ్‌యూఎల్ (0.26 శాతం), టాటా స్టీల్ (0.22 శాతం), వేదాంత (0.13 శాతం) కూడా ఉన్నాయి. అయితే, హీరో మోటోకార్ప్, ఎస్ బ్యాంక్, మారుతీ సుజికీ, పవర్‌గ్రిడ్, బజాజ్ ఆటో, ఎస్‌బీఐ, టాటా మోటార్స్, ఓఎన్‌జీసీ, ఎన్‌టీపీసీ, యాక్సిస్ బ్యాంక్, మహీంద్ర అండ్ మహీంద్ర, ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఐటీసీ లిమిటెడ్, కోల్ ఇండియా, ఎల్ అండ్ టీ, ఐసీఐసీ బ్యాంక్, హెచ్‌సీఎల్ టెక్, భారతీ ఎయిర్‌టెల్, హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్ కంపెనీల షేర్లు నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. వీటి వాతాల ధరల్లో సగటున 3.40 శాతం తగ్గుదల నమోదైంది.
ఈ వారం తొలి రోజున ట్రేడింగ్‌లో సంస్థాగత పెట్టుబడిదారులు ఆసక్తిని ప్రదర్శించడంతో సెనె్సక్స్ లాభాలు సాధ్యమైనట్టు విశే్లషకులు వ్యాఖ్యానిస్తున్నారు.