బిజినెస్

‘పెథాయ్’ ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 21: పెథాయ్ తుపాను కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. తడిసిన, రంగు మారిన ధాన్యాన్ని టన్నుకు 1550 రూపాయల చొప్పున పౌర సరఫరాల సంస్థ కొనుగోలు చేసేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో తుపాను కారణంగా వరి పంట 56,024 హెక్టార్లలో, మొక్కజొన్న, పొగాకు, పత్తి, వేరుశనగ, చెరకు, సన్‌ఫ్లవర్ తదితర పంటలు 12,518 ఎకరాల్లో దెబ్బతిందని వ్యవసాయ శాఖ అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. హెక్టారుకు 6 మెట్రిక్ టన్నుల చోప్పున తుపాను కారణంగా 3.36 లక్షల టన్నుల ధాన్యం నష్టపోయినట్లు అధికారులు తెలిపారు. ఇందులో ఏ గ్రేడ్ ధాన్యం విలువ 594 కోట్ల రూపాయలు, ఇతర రకాల ధాధ్యం 588 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. ఈ ధాన్యాన్ని టన్ను ధర 1550 రూపాయల చొప్పున కొనుగోలు చేయాలని ఆదేశించింది.