బిజినెస్

సవరించిన అంచనాలు ఆమోదించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలను త్వరగా ఆమోదించాలని, పెండింగ్‌లో ఉన్న 3722 కోట్ల రూపాయలను త్వరగా విడుదల చేయాలని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. ప్రాజెక్టు పనులు చాలా వేగంగా జరుగుతున్నాయని, ఇప్పటికే 64.31 శాతం మేర పనులు పూర్తి అయ్యాయని తెలిపారు. 2019 నాటికి ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రాజెక్టు పూర్తి చేసేందుకు లక్ష్యంగా పని చేస్తున్నామని వెల్లడించారు. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాక ఇప్పటి వరకూ 10,459 కోట్ల రూపాయలు ఖర్చు చేయగా, అందులో 6727 కోట్ల రూపాయలను చెల్లించారని, మరో 3722 కోట్ల రూపాయలు విడుదల చేయాల్సి ఉందని గుర్తు చేశారు. ఈ మొత్తం త్వరగా విడుదల చేయాలని ఆ లేఖలో డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉన్న పరిమిత ఆర్థిక వనరుల నుంచి ప్రాజెక్టు పనులకు నిధులు కేటాయిస్తున్నదని, దీనిని దృష్టిలో ఉంచుకుని త్వరగా నిధుల విడుదలకు చర్యలు తీసుకోవాలని కోరారు. నిధుల విడుదల్లో జాప్యం ఇతర పథకాల అమలుపై పడుతోందని తెలిపారు. ప్రాజెక్టు సవరించిన అంచనాలను కేంద్ర జల సంఘానికి (సీడబ్ల్యుసి)కి 2017 ఆగస్టులో అందచేశామని తెలిపారు. కావలిసిన అన్ని వివరాలను అందచేశామని, అయినా ఆమోదించకుండా ఇంకా పరిశీలనలో ఉందని చెబుతున్నారని తెలిపారు. సవరించిన అంచనాలతో ప్రాజెక్టుపై చేసిన ఖర్చు చెల్లింపులకు సంబంధం ఉండటం వల్ల సవరించిన అంచనాలు త్వరగా ఆమోదించాలని కోరారు. సవరించిన అంచనాలను ఆమోదించడంలో జాప్యం ప్రభావం ప్రాజెక్టు పనుల పురోగతిపై పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. భూసేకరణ, పురావాసం తదితర అంశాలను వేగవంతం చేయాల్సి ఉందని తెలిపారు. భూసేకరణ, పునరావాసానికి అవసరమైన శత శాతం నిధులు కేంద్రం ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. గతంలో ప్రాజెక్టును సందర్శించినప్పుడు ఫిబ్రవరి 2019 నాటికి పూర్తి అయ్యేలా సహకరిస్తామని ఇచ్చిన హామీని గుర్తు చేశారు. ఐదు రాష్ట్రాల అభివృద్ధికి కీలకమైన ఈ ప్రాజెక్టుకు సంబంధించి సవరించిన అంచనాల ఆమోదం, పెండింగ్‌లో ఉన్న నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

చిత్రం..ముఖ్యమంత్రి రాసిన లేఖను కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి
అందజేస్తున్న మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు