బిజినెస్

కేవలం 9మంది చేతిలో భారత్ సంపద

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దావోస్, జనవరి 21: దేశంలో ఒక పక్క ధనవంతులు మరింత కుబేరులు అవుతుండగా, పేదవాళ్లు పేదవారిగానే మిగిలిపోతున్నారు. పేద-ధనిక వర్గాల మధ్య అంతరం రోజురోజుకూ ఎక్కువైపోతోందని ఇది సమాజానికి ప్రమాదకర ధోరణి అని హెచ్చరిస్తోంది ఆక్స్‌ఫామ్ స్టడీ నివేదిక. భారత్ దేశంలో కేవలం తొమ్మిది మంది అతి ధనవంతుల సంపద అట్టడుగు వర్గాలకు చెందిన 50 శాతం ప్రజల ఆదాయంతో సమానంగా ఉందని ఆక్స్‌ఫామ్ నివేదిక సోమవారం వెల్లడించింది. కేవలం ఒక శాతం మంది మాత్రమే ఉన్న ఈ బిలియనర్లు రోజుకు 2,200 కోట్ల వరకు ఆర్జిస్తూ తమ సంపదను 39 శాతం పెంచుకుంటుండగా, జనంలో సగం మంది వరకు పేదవర్గాల వారి సంపద కేవలం మూడు శాతం మాత్రమే పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా బిలియనర్లు తమ సంపదను గత ఏడాదిలో 12 శాతాన్ని పెంచుకున్నారు. రోజువారీగా చూస్తే రోజుకు 2.5 బిలియన్ డాలర్లతో సమానం. అదే సమయంలో ప్రపంచంలోని పేదవర్గాల వారి సంపద 11 శాతం తగ్గిందని ఆక్స్‌ఫామ్ సోమవారం విడుదల చేసిన తన వార్షిక నివేదికలో తెలియజేసింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యుఈఎఫ్) వార్షిక సమావేశం స్విస్‌స్కై రిస్టార్టు టౌన్‌లో ఐదురోజుల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ సంస్థ తన నివేదిక వివరాలను వెల్లడిస్తూ భారత్‌లోని జనాభాలో పది శాతం, అనగా 13.6 కోట్ల మంది పేదరికం స్థాయిలో ఉన్నారని సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విన్నీ బ్యానియిమా తెలిపారు. డబ్ల్యూఈఎఫ్‌కు హాజరయ్యే పెద్దపారిశ్రామికవేత్తలు, రాజకీయనేతలు ముందుగా ఈ పేద-గొప్ప పెరుగుదల శాతాన్ని తొలుత పరిశీలించాలని, ఈ రెండింటి మధ్యన రోజురోజుకు అనూహ్యరీతిలో పెరిగిపోతున్న అంతరాన్ని చూడాలని అన్నారు. పేదరిక శాతం పెరిగిపోతే సమాజంలో అశాంతికి దారితీస్తుందని, ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తుందని, పేదల్లో ఆగ్రహం పెల్లుబుకుతుందని ఆయన పేర్కొన్నారు. భారతదేశంలో కొద్దిమంది వ్యక్తులు తమ సంపదను అపారంగా పెంచుకుంటూ పోతుండగా, మెజారిటీ శాతం ఉన్న పేదలు ఆ రోజు భోజనం కోసం, పిల్లల మందులు, ఇతర అవసరాల కోసం నానా పాట్లు పడుతున్నారని ఆయన చెప్పారు. మన దేశంలో అత్యంత ధనవంతులైన వారు కేవలం ఒక శాతం మాత్రమే ఉన్నా వారే ఆర్థిక వ్యవస్థను శాసిస్తున్నారని, ఇది భారతదేశ ప్రజాస్వామ్య, సామాజిక వ్యవస్థను కుప్పకూలుస్తుందని ఆయన హెచ్చరించారు. కేవలం ఒక శాతం మంది వ్యక్తుల చేతిలో 51.53 శాతం దేశ సంపద ఉండగా, పది శాతం మంది చేతిలో 77.4 శాతం సంపద ఉందని ఆయన తెలిపారు. దిగువ స్థాయిలో ఉన్న 60 శాతం జనాభాలో కేవలం 4.8 శాతం సంపద మాత్రమే ఉందని, తొమ్మిది మంది బిలియనర్ల సంపద 50 శాతం ప్రజల సంపదతో సమానమని, ఇది భారత్‌కు ప్రమాదకరమని పేర్కొన్నారు