బిజినెస్

ఆ వేగం.. ఇతర రాష్ట్రాల్లో లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 22: ఏపీ ప్రభుత్వం, అధికారులు స్పందించినంత వేగంగా ఇతర రాష్ట్రాల్లో అక్కడి అధికార యంత్రాంగం పని చేసే పరిస్థితి లేదని అదాని గ్రూపు ఎండీ అనిల్ సార్దానా కితాబిచ్చారు. దావోస్ పర్యటనలో భాగంగా వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో అనిల్‌తో మంత్రి లోకేష్ మంగళవారం భేటీ అయ్యారు. ఏపీలో డేటా సెంటర్ ఏర్పాటును వేగవంతం చేయాలని కోరారు. జనవరి నెలాఖరునాటికి భూమి పూజ చేసి పనులు ప్రారంభించాలన్నారు. దీనిపై అనిల్ స్పందిస్తూ, ఏపీలో పెట్టుబడులు పెట్టాలని నిర్ణయం తీసుకున్నాక, తమకు అనేక ఫోన్లు వచ్చాయని వెల్లడించారు. ఏపీకి ఎందుకు వెళ్తున్నారు, మా రాష్ట్రానికి రావచ్చుగా అంటూ కొంతమంది ముఖ్యమంత్రులు ఆహ్వానించారని తెలిపారు. ఏపీ ప్రభుత్వం, అధికారులు పని చేసినంత వేగంగా ఇతర రాష్ట్రాల్లో పరిస్థితులు అనుకూలంగా లేవన్నారు. అభివృద్ధి చేయాలనే లక్ష్యం ఉండటం వేరని, దానిని అమలు చేయడం వేరన్నారు. వేగంగా తమకు అనుమతులు ఇస్తున్నారని, అంతే వేగంగా డేటా సెంటర్ ఏర్పాటు చేయలన్న లక్ష్యంతో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు. అమరావతి అభివృద్ధిలో ఏపీ ప్రభుత్వంతో కలిసి పని చేయాలని నిర్ణయించుకున్నామన్నారు. కనెక్టడ్ స్మార్ట్ సిటీస్ ఏర్పాటులో అదాని గ్రూపు సర్వీస్ అందిస్తుందన్నారు. విద్యుత్ సరఫరా, ఫైబర్ కనెక్టివిటీ, టెలిఫోన్, మంచినీరు, పార్కింగ్, స్ట్రీల్ లైటింగ్, ఏపీ తదితర అనేక సర్వీసులు కలిపి ప్రజలకు అందించే సర్వీస్ ప్రస్తుతం భారత్ లేవన్నారు.