బిజినెస్

ఐఎల్ అండ్ ఎఫ్‌ఎస్ రుణాలపై మినహాయింపులు..వాయిదాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 22: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ఐఎల్ అండ్ ఎఫ్‌ఎల్ గ్రూపు పరిధిలోని సంస్థలకు ఇచ్చిన బ్యాంకు రుణాలపై కొన్ని మినహాయింపులు, లేదా వాయిదాలు ఇవ్వాలని రిజర్వు బ్యాంకును కోరాలని కేంద్ర ప్రభుత్వం కోరనుంది. ఇందుకు సంబంధించిన సాధ్యాసాధ్యాలు, సమస్యలపై మంగళవారం కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సమీక్షించింది.
ప్రస్తుతం ఈ సంస్థలకు సంబంధించిన ఆస్తుల విక్రయం ద్వారా ఆర్థిక స్థితిగతులను పునరుద్ధరించే కార్యక్రమం సైతం కేంద్ర పరిశీలనలో ఉన్న సంగతి తెలిసిందే. కాగా ఐఎల్ అండ్ ఎస్‌ఎఫ్ గ్రూప్ నుంచి వేరుపడిన సంస్థల్లో కొన్ని రూ.91వేల కోట్లకు పైబడి అప్పులున్న సంస్థలు తిరిగి రుణాలు చెల్లించడం లేదు. ఈ క్రమంలో సంస్థల్లో ద్రవ్య లభ్యతను పెంచేలా 2018 చివరిలో కేంద్ర ప్రభుత్వం కృషి ఆరంభించింది. ఐఎల్ అండ్ ఎఫ్‌ఎల్ బోర్డును సైతం కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ రద్దు చేసింది. ఈ క్రమంలో మరో నాలుగు నుంచి ఐదు నెలల్లో ఐఎల్ అడ్ ఎఫ్‌ఎల్ గ్రూపు అన్ని సమస్యల నుంచి బయటపడుతుందన్న అభిప్రాయం అంతటా వ్యక్తమవుతోంది. ఐతే కేంద్రం తీసుకురానున్న తాజా ప్రతిపాదన విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని రిజర్వుబ్యాంకు భావిస్తోంది. ప్రత్యేకించి బ్యాంకులకు సంబంధించిన నిరర్ధక ఆస్తుల విషయంలో కఠినతర నిబంధలను పాటిస్తున్న రిజర్వుబ్యాంకు ఐఎల్ అడ్ ఎఫ్‌ఎల్‌కు సంబంధించినంత వరకు నిబంధనల సడలింపు, సమస్య పరిష్కారానికి కొంత సమయం కూడా కోరే అవకాశాలున్నాయి.