బిజినెస్

ఐదు రోజుల సూచీల పరుగుకు బ్రేక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: దేశీయ ఈక్విటీ మార్కెట్లలో ఐదు రోజులపాటు కొనసాగిన సూచీల ర్యాలీకి మంగళవారం బ్రేక్ పడింది. ఉదయం లాభాలతో ఆరంభమైన ఈ మార్కెట్లు లోహ, ఆర్థిక, మోటారు వాహన రంగాల్లో మదుపర్లు లాభాల స్వీకరణకు పాల్పడంతో ఒక దశలో మరీ దిగువకు చేరిన సెనె్సక్స్, నిఫ్టీ తర్వాత కొంత కోలుకోవడంతో మార్కెట్ వర్గాలు ఊపిరిపీల్చుకున్నాయి. సెనె్సక్స్ 134.32 పాయింట్లు నష్టపోయి 36,444.64 వద్ద, నిఫ్టీ 39.10 పాయింట్లు నష్టపోయి 10,922.75 దిగువకు చేరుకున్నాయి.
మార్కెట్ సెంటిమెంట్ సానుకూలంగానే ఉన్నా మదుపర్లు లాభాల స్వీకరణకు పాల్పడటం విశేషం. తొలుత 36,649.92 ఎగువన మొదలైన సెనె్సక్స్ 36,650.47 వద్దకు చేరుకుంది. దేశీయ సంస్థాగత మదుపర్లతోబాటు రీటైల్‌గా పాల్గొనేవారు సైతం కొనుగోళ్లకు పాల్పడిన క్రమంలో సెనె్సక్స్‌కు సానుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. ఐతే ఆ తార్వాత ఒక దశలో పదుపర్లు లాభాల స్వీకరణకు దిగడంతో సెనె్సక్స్ 134.32 పాయింట్లు నష్టపోయి తొలుత 36,282.93 దిగువకు చేరుకుని ఆ తర్వాత 36,444.64 వద్దకు చేరి స్థిరపడింది. మొత్తం ఐదు రోజుల పాటు దేశీయ మార్కెట్ల ర్యాలీ కొనసాగడంతో బీఎస్‌ఈ సెనె్సక్స్ 725 పాయింట్లు లాభపడగా, నిఫ్టీ సైతం 39.10 పాయింట్లు లాభపడింది. మంగళవారం కూడా 10,922.75 పాయింట్లతో ఆరంభమైన ఈ నిఫ్టీ ఒక దశలో 10,949.80 ఎగువకు చేరుకుంది. ఐతే ఆ తర్వాత కొంత దిగివచ్చి 10,864.15 వద్ద స్థిరపడింది.
కాగా మదుపర్లు పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించి లాభాల స్వీకరణకు పాల్పడటం వల్లే ఐదు రోజుల అనంతరం ఇలా సూచీలు తగ్గుముఖం పట్టాయని స్టాక్ బ్రోకర్లు అభిప్రాయపడుతున్నారు. ఆసియన్ మార్కెట్లు, ఐఎంఎఫ్ బలహీన పరిస్థితులు భారతీయ స్టాక్ మార్కెట్లపై ప్రభావం చూపాయని అశోకా గ్రూప్‌నకు చెందిన ఈక్విటీ రీసెర్చ్ విభాగం అధ్యక్షుడు పరాస్ బోత్రా పేర్కొన్నారు. భారత ఆర్థిక రంగ పరిస్థితులు చక్కబడ్డాయని ఒవైపు వార్తలు వస్తున్నా ప్రస్తుత ఆర్థిక లోటును ఎలా భర్తీ చేస్తారన్న విషయంపై స్పష్టత లేకపోవడంతో మంగళవారం మదుపర్లు ఆచితూచి వ్యవహరించారని ఆయన పేర్కొన్నారు.