బిజినెస్

శ్రీసిటీలో మరో భారీ పరిశ్రమకు భూమిపూజ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తడ/సత్యవేడు, జనవరి 23: నెల్లూరు - చిత్తూరు జిల్లాల సరిహద్దులో ఏర్పాటు చేసిన శ్రీసిటీలో మరో భారీ పరిశ్రమకు బుధవారం భూమిపూజ చేశారు. లీవియర్ మోషన్ గైడ్లు, రవాణా వాహనాల సామగ్రి తయారీలో పేరుగాంచిన జపాన్‌కు చెందిన టీహెచ్‌కె కంపెనీ అనుబంధ సంస్థ టీహెచ్‌కె ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమ నిర్మాణానికి టీహెచ్‌కే గ్రూప్ అధ్యక్షులు, సీఈవో అఖిహీరో టెరమాసీ, శ్రీసిటీ ఎండీ రవీంద్ర సన్నారెడ్డిలు భూమిపూజ కార్యక్రమాన్ని లాంఛనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎండీ రవీంద్ర సన్నారెడ్డి మాట్లాడుతూ హైటెక్ ఇంజనీరింగ్ విభాగంలో మరో ప్రముఖ పరిశ్రమ శ్రీసిటీలో ఏర్పాటు కావడం ఆనందంగా ఉందన్నారు. భారతదేశంలో టీహెచ్‌కేకు సంబంధించిన మొట్టమొదటి కర్మాగారం శ్రీసిటీలో ఏర్పాటు చేయడం ఎక్కువ ప్రాధాన్యతను సంతరించుకుందన్నారు. అనంతరం సీఈవో టెరమాసీ మాట్లాడుతూ వివిధ పరిశ్రమలతో పాటు తమ ఉత్పత్తులను కూడా భారతదేశంలో అందుబాటులోకి తేవడానికి తమ పరిశ్రమను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సుమారు 50 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్లాంట్ ఏర్పాటు అవుతోందని, జనవరి 2020 నాటికి ఉత్పత్తులను ప్రారంభిస్తుందన్నారు. దీనివల్ల దాదాపు 400 మంది నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో టీహెచ్‌కే గ్రూప్ డైరెక్టర్ టకాతి టెరమాసీ, శ్రీసిటీ ప్లాంట్ అధికారి నోజోమిటమాడాలు పాల్గొన్నారు.

చిత్రం..శ్రీసిటీలో టీహెచ్‌కే పరిశ్రమకు భూమిపూజ చేస్తున్న దృశ్యం