బిజినెస్

జిల్లాకో విమానాశ్రయం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 6: ఆంధ్ర రాష్ట్రంలో పెరుగుతున్న విమాన ప్రయాణికుల సంఖ్య, పారిశ్రామికాభివృద్ధి, వౌలిక సదుపాయాలు, భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని జిల్లాకో విమానాశ్రయం ఏర్పాటుచేసే యోచనలో ప్రభుత్వం ఉంది. ఇప్పటికే విశాఖ, కృష్ణా, తూర్పుగోదావరి, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో విమానాశ్రయాలున్నాయి. బ్రిటీష్ కాలంలో ఏర్పాటైన ప్రకాశం జిల్లా దొనకొండ, కడపలోని విమానాశ్రయాలను పునరుద్ధరించనున్నారు. విజయనగరం జిల్లాలో విమానాశ్రయ నిర్మాణానికి స్థల సేకరణ జరుగుతోంది. మిగిలిన జిల్లాల్లో కూడా ప్రాధాన్యతా క్రమంలో విమానాశ్రయాలను ఏర్పాటు చేయనున్నారు. అవసరమైతే మినీ విమానాలు దిగే విధంగా చిన్న విమానాశ్రయాలను నిర్మిస్తారు. విద్య, వైద్యం, పారిశ్రామిక రంగాల అభివృద్ధితోపాటు విదేశీ పర్యాటకులను ఆకర్షించాలంటే విమానాశ్రయాల అవసరం కూడా ఉండటమే ఎయిర్‌పోర్టుల ఏర్పాటు వెనకున్న ప్రధాన కారణం. అభివృద్ధి చెందిన ప్రాంతాన్ని గుర్తించే విషయంలో విమానాశ్రయాలకు ప్రాధాన్యత ఉంది. వౌలిక సదుపాయాల కల్పనలో విమానాశ్రయాలదే కీలక భూమిక.
పౌర విమానయాన రంగంలో 2022 నాటికి రాష్ట్రాన్ని పెట్టుబడుల గమ్యస్థానంగా మార్చాలన్న ధ్యేయంతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఈ లక్ష్యాన్ని సాధించాలంటే పౌర విమానయాన రంగం అభివృద్ధి చెందాల్సి ఉంది. అందుకు దాని నిర్వహణ పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యంలో ఉండాలి. రాష్ట్రంలో ఎంపిక చేసిన పట్టణాలకు విమాన సర్వీసులు అందుబాటులోకి రావాలి. తద్వారా సమతుల్య అభివృద్ధికి మార్గం ఏర్పరచడాన్ని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. గత ఆర్థిక సంవత్సరం (2015-16) రాష్ట్రంలో విమాన ప్రయాణాలు 59 శాతం పెరిగాయి. తిరుపతి విమానాశ్రయం నుంచి 49 శాతం పెరిగితే, రాజమండ్రి నుంచి 39 శాతం, విశాఖపట్నం నుంచి 62, విజయవాడ నుంచి 75 శాతం చొప్పున పెరిగాయ. ఇదే సమయంలో దేశం మొత్తం మీద విమాన ప్రయాణాల వృద్ధి 17 శాతంగానే ఉండటం గమనార్హం. భవిష్యత్తులో ఆంధ్ర రాష్ట్ర ఎయిర్ ట్రాఫిక్ ఇంకా వేగం పుంజుకుంటుందన్నది నిపుణుల అభిప్రాయం. విశాఖ విమానాశ్రయం నుంచి దేశంలోని ప్రధాన నగరాలతోపాటు విదేశాలకు కూడా విమాన సర్వీసులు నడుపుతున్నారు. ఈ క్రమంలో ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా విశాఖతోపాటు తిరుపతి, విజయవాడల నుంచి కూడా అంతర్జాతీయ విమాన సర్వీసులు నడుపనున్నారు.
విమానాశ్రయాల అభివృద్ధికి రాష్ట్రంలో ప్రత్యేక అథారిటీ
రాష్ట్రంలో విమానాశ్రయాలను అభివృద్ధి చేయనున్న నేపథ్యంలో ‘ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్’ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. విమానాశ్రయాల అభివృద్ధి, కొత్త విమానాశ్రయాల ఏర్పాటు, డొమెస్టిక్ సర్వీసుల పెంపు వంటి బాధ్యతలను ఈ అథారిటీకి అప్పగిస్తారు. భోగాపురం, దగదర్తి, ఓర్వకల్లు, నాగార్జునసాగర్, దొనకొండ, బొబ్బిలిలలో ఐదు కొత్త విమానాశ్రయాలను ఏర్పాటు చేయనున్నారు. వీటిలో భోగాపురం, దగదర్తి, ఓర్వకల్లు విమానాశ్రయాలను గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాలుగా నిర్మించనున్నారు. దొనకొండ, నాగార్జునసాగర్, బొబ్బిలి విమానాశ్రయాలను బ్రౌన్ ఫీల్డ్ విమానాశ్రయాలుగా నిర్మించనున్నారు. అలాగే పుట్టపర్తిలో ప్రస్తుతమున్న విమానాశ్రయంలో రాత్రిపూట కూడా ల్యాండింగ్ సదుపాయాన్ని కల్పించనున్నారు. దాంతోపాటు అక్కడ ఫ్లయింగ్ అకాడమీని ఏర్పాటు చేయనున్నారు. మరోవైపు విజయవాడ, తిరుపతి, రాజమండ్రి విమానాశ్రయాలను శరవేగంగా విస్తరించేందుకు వడివడిగా అడుగులు ముందుకు పడుతున్నాయి. గన్నవరం విమానాశ్రయ విస్తరణ పనులు ఇప్పటికే శరవేగంగా జరుగుతున్నాయి. ఇక్కడ నుంచి విదేశాలకు కూడా విమాన సర్వీసులు నడపడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రానికి కేంద్ర బిందువుగా, రాజధాని అమరావతికి అతి సమీపంలో ఉండటంతో దీనికి మరింత ప్రాధాన్యత పెరిగింది.