బిజినెస్

నాలుగోసారి మాల్యాకు నాన్-బెయిలబుల్ వారెంట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 6: విజయ్ మాల్యాకు ఓ ఢిల్లీ కోర్టు శనివారం నాన్-బెయిలబుల్ వారెంట్‌ను జారీ చేసింది. మాల్యాపై ఇది నాలుగో నాన్-బెయలబుల్ వారెంట్. 2012 లో చెక్ బౌన్సు కేసుకు సంబంధించి ఈ వారెంట్‌ను ఇక్కడి మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ సుమీత్ ఆనంద్ జారీ చేయగా, నవంబర్ 4న కోర్టుకు మాల్యా హాజరు కావాల్సిందిగా ఆదేశించారు. మాల్యా ప్రస్తుతం లండన్‌లో ఉండటంతో ఈ వారెంట్‌ను అందజేయాలంటూ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు కోర్టు పంపింది. కోర్టు ఆదేశాల ధిక్కరణ, విచారణలకు హాజరుకాకపోతుండటంతో మాల్యా హాజరుకు తగిన చర్యలు చేపట్టాలనీ కోర్టు ఈ సందర్భంగా సూచించింది. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్వహిస్తున్న డిఐఎఎల్‌కు 2012 ఫిబ్రవరి 22న కోటి రూపాయల చెక్కును కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ ఇచ్చింది. నిధులు లేక ఇది బౌన్స్ అవగా, ఆ తర్వాతా ఇలాగే జరిగింది. మొత్తం రూ. 7.5 కోట్ల విలువైన చెక్కులు క్లియరెన్స్ కాకపోవడంతో 2012 జూన్‌లో డిఐఎల్ కోర్టును ఆశ్రయించింది.