బిజినెస్

విశాఖ పోర్టులో నేపాల్ కార్గో హ్యాండ్లింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఆగస్టు 8: నేపాల్‌కు సంబంధించిన ఎగుమతి, దిగుమతుల (ఎగ్జిమ్) కార్గో హ్యాండ్లింగ్‌కు విశాఖ పోర్టు ట్రస్టు సిద్ధమైంది. కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్, కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తదితర సంస్థలు నేపాల్‌కు చెందిన సరకు రవాణా సంస్థలతో అవగాహనకు వచ్చాయి. భారత్, నేపాల్ వాణిజ్య ఒప్పందాల్లో భాగంగా నేపాల్‌కు చెందిన ఎగుమతి, దిగుమతులను విశాఖ పోర్టు నుంచి నిర్వహించేందుకు ఒప్పందం జరిగింది. ఇప్పటివరకూ కోల్‌కతాలోని హల్దియా పోర్టు నుంచి మాత్రమే నేపాల్ ఎగ్జిమ్ కార్గోను హ్యాండిల్ చేసేవారు. అయితే డీప్‌సీ పోర్టు ద్వారా ఈ కార్గోను హ్యాండిల్ చేసేందుకు అనుమతించాలని నేపాల్ ప్రధాని కోరండంతో విశాఖ పోర్టు నుంచి ఆ కార్గోను హ్యాండిల్ చేసేందుకు అనుమతించారు. ఈ నేపథ్యంలో జూన్‌లో లాంఛనంగా కంటైనర్ కార్గొను విశాఖ నుంచి నేపాల్‌కు రవాణా చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. అయితే విశాఖ నుంచి సరకు రవాణా చార్జీలు ఎక్కువగా ఉన్నాయని నేపాల్ చాంబర్ ఆఫ్ కామర్స్, నేపాల్ ఎగ్జిమ్ ఫ్రీట్ పార్వర్డర్స్ అసోసియేషన్ వంటివి వెనుకంజ వేశాయి. దీంతో విశాఖ నుంచి నేపాల్ కార్గో హ్యాండ్లింగ్ పుంజుకోలేదు. నిజానికి హల్దియా పోర్టులో కూడా తక్కువ లోతు కారణంగా కొన్ని నౌకలను మాత్రమే హ్యాండిల్ చేసే వీలు ఉండటం, రైల్వే రవాణా వ్యవస్థ పాతది కావడం, సరకు నిల్వ చేసేందుకు తగిన స్థలం లేకపోవడం, కార్మికుల సమస్య, ట్రాఫిక్ సమస్య కారణంగా సరకును తరలించేందుకు అధిక వ్యయం అవుతోంది. టర్న్ ఎరౌండ్ సమయం దాదాపు 42 రోజులు పడుతుండగా, ఆయా వాణిజ్య నౌకలు 28 రోజులే గడువు ఇస్తుండటంతో వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారు. దీనివల్ల రవాణా వ్యయం ఇబ్బుడిముబ్బడిగా పెరుగుతోంది. దీంతోనే ప్రత్యామ్నాయంగా విశాఖ పోర్టు నుంచి సరకు రవాణాకు అవకాశం ఇచ్చారు. అయితే భారత్, నేపాల్ సరిహద్దు ప్రాంతమైన బిర్‌గంజ్‌కు కోల్‌కతా నుంచి 704 కిలోమీటర్ల దూరం ఉండగా, విశాఖ నుంచి దాదాపు 1,400 కిలోమీటర్ల దూరం ఉంటుంది. దీంతో వ్యాపారులు అటువైపే మొగ్గు చూపారు. కానీ విశాఖ పోర్టులో ఉన్న ఆధునిక సౌకర్యాల కారణంగా సరకు రవాణకు కోల్‌కతా కన్నా 15 శాతం తక్కువ వ్యయం అవుతుందని ఒక అధ్యయనంలో తేల్చడంతో నేపాల్ వర్తక సంఘ నేతలు రవాణా చార్జీలు తగ్గించాలని విశాఖ పోర్టు అధికారులను కోరుతున్నారు. ఈ నేపథ్యంలో విశాఖ పోర్టు ట్రస్టు అధికారులు నేపాల్‌లో కొద్ది రోజుల క్రితం పర్యటించి వారికి వివిధ అంశాలపై స్పష్టత ఇచ్చారు. 8,000 కంటైనర్లను రవాణ చేసే నౌకలు విశాఖ పోర్టుకు వచ్చే అవకాశం గురించి వివరించారు. హల్దియా పోర్టులో దిగుమతికి రెండున్నర రోజులు పడుతుండగా, విశాఖలో దాదాపు అరపూటలో ఆ పని కానిచ్చేస్తారు. దీనివల్ల ఒక కంటైనర్‌కు 200 డాలర్ల వరకూ ఆదా అవుతుందని అంచనా. విశాఖ పోర్టులో ఉన్న ఆధునిక సౌకర్యాలు, ఆన్‌లైన్ వ్యవస్థ వంటివి వివరించారు. భారతీయ రైల్వే అనుబంధ సంస్థ కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో రవాణా చార్జీలకు సంబంధించి స్పష్టత ఇచ్చారు. విశాఖ పోర్టు కూడా కొన్ని ప్రత్యేక సౌకర్యాలతోపాటు నేపాల్ కాన్సులేట్ జనరల్ కార్యాలయ నిర్మాణానికి స్థలం కేటాయించేందుకు సుముఖత వ్యక్తం చేసింది. విశాఖ కంటైనర్ టెర్మినల్ కూడా అవసరమైన ఏర్పాట్లు చేయడం గమనార్హం. విశాఖలోని సెంట్రల్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ అధికారులు సైతం గత బుధవారం నేపాల్ కార్గొ రవాణాకు సంబంధించి మార్గదర్శకాలు జారీ చేశారు. నేపాల్ కార్గొను రోడ్డు మార్గం ద్వారా ఆ దేశ సరిహద్దుల్లోని నాలుగు ప్రాంతాలకు, రైళ్ల ద్వారా బిర్‌గంజ్‌కు రవాణా చేసేందుకు వీలు కల్పించారు. నేపాల్‌కు పరిమితమైన కార్గో భారత్‌లో లావాదేవీలు నిర్వహించకుండా చూసేందుకు ఆ కంటైనర్లపై ఈ శాఖ అధికారులు మరో సీల్ వేస్తా రు. ఈ క్రమంలో నేపాల్.. విశాఖ పోర్టు నుంచి కార్గో హ్యాండ్లింగ్‌కు సిద్ధమవుతోంది. మొత్తానికి చాలా కాలంగా నేపాల్ వర్తకులు ఎదురుచూస్తున్న సేవలు వారికి అందుబాటులోకి రానున్నాయి.