బిజినెస్

క్షీణించిన ఐడియా లాభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 8: దేశీయ ప్రైవేట్‌రంగ టెలికామ్ సంస్థ ఐడియా సెల్యులార్ ఏకీకృత నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2016-17) మొదటి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో భారీగా క్షీణించింది. 74.5 శాతం తగ్గి 217.1 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2015-16) తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో 851.6 కోట్ల రూపాయల లాభాన్ని సంస్థ అందుకుంది. అయితే ఆదాయం ఈసారి 9,486.64 కోట్ల రూపాయలుగా ఉంటే, పోయినసారి 8,791.54 కోట్ల రూపాయలుగా ఉంది. ఈ మేరకు సోమవారం ఐడియా సెల్యులార్ ప్రకటించింది. కాగా, 2014 స్పెక్ట్రమ్ వేలంలో 10,420 కోట్ల రూపాయల పెట్టుబడులను పెట్టిన ఐడియా.. 2015 స్పెక్ట్రమ్ వేలంలో 30,140 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టింది. 3జి, 4జి సేవల స్పెక్ట్రమ్ కొనుగోళ్లూ లాభంపై ప్రభావం చూపాయని సంస్థ పేర్కొంది.