బిజినెస్

పెరిగిన ‘హీరో’ లాభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 8: దేశీయ ఆటోరంగ దిగ్గజం, ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో గతంతో పోల్చితే 18.13 శాతం పెరిగింది. ఈసారి 883.10 కోట్ల రూపాయల లాభాన్ని పొందిన సంస్థ.. గత ఆర్థిక సంవత్సరం (2015-16) ఏప్రిల్-జూన్ వ్యవధిలో 747.54 కోట్ల రూపాయల లాభంతో సరిపెట్టుకుంది. నికర అమ్మకాలు కూడా 7.7 శాతం ఎగిసి ఈసారి 7,901.34 కోట్ల రూపాయలుగా ఉంటే, పోయినసారి 7,335.84 కోట్ల రూపాయలుగా ఉన్నాయి. ఈ మేరకు సోమవారం హీరో మోటోకార్ప్ తెలిపింది. కాగా, సగటు వర్షపాతాన్ని మించి వర్షాలు పడటం, 7వ వేతన సంఘం సిఫార్సులు వాహన కొనుగోళ్లకు దోహదం చేస్తాయని సంస్థ చైర్మన్ ఎండి, సిఇఒ పవన్ ముంజల్ అభిప్రాయపడ్డారు.