బిజినెస్

4 లక్షల క్వింటాళ్ల జనపనార సేకరణ లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఆగస్టు 8: దేశంలో వివిధ ప్రాంతాల్లో నాలుగు లక్షల క్వింటాళ్ల మేర జనపనార సేకరణ లక్ష్యంగా పెట్టుకున్నట్లు జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (జెసిఐ) సిఎండి డాక్టర్ కెవిఆర్ మూర్తి తెలిపారు. జెసిఐ సిఎండిగా బాధ్యతలు స్వీకరించాక సోమవారం తొలిసారిగా విజయనగరం రీజియన్‌లో పర్యటించేందుకు ఆయన వచ్చారు. ఈ సందర్భంగా విశాఖలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మట్లాడుతూ మార్కెట్‌లో జనపనార ఉత్పత్తుల వాటా పెంచేందుకు వీలుగా జనపనార కొనుగోళ్లకు ఊతమిచ్చేలా మద్దతు ధర చెల్లింపు లేదా ఇతర సంస్థల ద్వారా సేకరణకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అయతే చాలా ప్రాంతాల్లో తమ శాఖ ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాల ద్వారానే ఈ లావాదేవీలను నిర్వహిస్తామన్నారు. కాగా, జనపనార రైతులను ప్రోత్సహించే చర్యల్లో భాగంగా చెల్లింపులను సక్రమంగా జరిగేందుకు రైతు స్నేహపూర్వక విధానాలను అమలు చేయనున్నట్లు తెలిపారు. బ్యాంకుల ద్వారా సన్నకారు రైతులకు చెల్లింపుల తీరుపై అసంతృప్తి వ్యక్తం అవుతున్న తరుణంలో జూట్ బ్యాంకింగ్ విధానాన్ని అమలు చేసే యోచన ఉందన్నారు. ఇప్పటికే జూట్-ఐకేర్ వంటి విధానాల ద్వారా 40 వేల మంది రైతులకు లబ్ధి చేకూర్చామని వివరించారు. మరిన్ని కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి జనపనార సేకరణ లక్ష్యాలను రీజియన్‌ల వారీగా నిర్ణయించామని, కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, గిడ్డంగుల మరమ్మతులు, బైలింగ్ ప్రెస్ యంత్రాల మరమ్మతులను యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్నామని పేర్కొన్నారు. జనపనార ఉత్పత్తులను ఆన్‌లైన్‌లో అమ్మడం, వివిధ ప్రదర్శనల్లో వాటిని ప్రదర్శించడం ద్వారా వినియోగం పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. రైతులకు మేలు చేకూర్చేందుకు అన్ని చర్యలు న్నామని చేపడుతున్నామని స్పష్టం చేశారు.