బిజినెస్

వచ్చే నెలలో తుది నిర్ణయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7: తీవ్రమయిన ఆర్థిక సంక్షోభంలో కూరుకున్న జెట్ ఎయిర్‌వేస్‌కు చెందిన పైలట్లు ఈ వారం ప్రస్తుత పరిస్థితిపై చర్చించారు. జెట్ ఎయిర్‌వేస్ తమకు నిర్దిష్ట గడువులోగా పాక్షికంగా వేతనాలు చెల్లించకపోతే ఏం చేయాలనే అంశంపై వారు వచ్చే నెలలో తుది నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. తీవ్రమయిన ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఈ ప్రైవేటు విమానయాన సంస్థ తాను తీసుకున్న రుణాలను పునర్వ్యవస్థీకరించుకోవాలని, నిధులు సేకరించాలని చూస్తోంది. జెట్ ఎయిర్‌వేస్ ఆర్థిక సంక్షోభం కారణంగా పైలట్లు సహా అనేక మంది ఉద్యోగులకు సకాలంలో వేతనాలు చెల్లించకలేక పోతోంది. నేషనల్ ఏవియేటర్స్ గిల్డ్ (ఎన్‌ఏజీ) ముంబయిలో సోమవారం నిర్వహించిన ఓపెన్ హౌస్ మీటింగ్‌లో జెట్ ఎయిర్‌వేస్ విమానయాన సంస్థ ప్రస్తుతం ఎదుర్కొంటున్న పరిస్థితిపై చర్చించడం జరిగిందని ఆ వర్గాలు వివరించాయి. ఎన్‌ఏజీ అనేది విమానయాన సంస్థ పైలట్లకు ప్రాతినిథ్యం వహిస్తున్న సంస్థ. గత సంవత్సరం డిసెంబర్‌లో పైలట్లకు తెలియజేసిన షెడ్యూలు ప్రకారం వేతనాలు చెల్లించడంలో జెట్ ఎయిర్‌వేస్ విఫలం కావడంపై ప్రధానంగా ఈ సమావేశంలో చర్చించినట్లు ఆ వర్గాలు వెల్లడించాయి. ఫిబ్రవరి నెల వేతనాలు హామీ ఇచ్చిన గడువులోగా చెల్లించడంలో యాజమాన్యం విఫలమయితే తిరిగి వచ్చే నెల పైలట్లు సమావేశమయి, భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి తుది నిర్ణయం తీసుకుంటారని ఆ వర్గాలు వివరించాయి. జెట్ ఎయిర్‌వేస్ ఫిబ్రవరి 21న జరుగనున్న తన వాటాదారుల సమావేశంలో తాను తీసుకున్న రుణాలను వాటాలుగా మార్చడంతో పాటు ఇతర ప్రతిపాదనలను ఆమోదించాల్సింగా కోరనుంది.